అక్కడ మరోసారి టెన్షన్.. టెన్షన్

June 3, 2026 7:38 AM
middle-east-tensions

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. కువైట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాల్పడింది. కువైట్ వాయు రక్షణ వ్యవస్థ వాటిని గాల్లోనే విజయవంతంగా అడ్డుకుంది. కువైట్‌లోని తమ సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నామని, తమకు ఎలాంటి నష్టం జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయిన వస్తువుల వద్దకు వెళ్లవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. ఇటీవల తమ రాడార్, డ్రోన్ సైట్లపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధిలోని వ్యూహాత్మక ఖెష్మ్ దీవి ప్రాంతంలోనూ భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. బహ్రెయిన్‌లోనూ సైరన్లు మోగాయని పలువురు నివేదించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media