ఆ నిర్మాత మీద నేను చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అబద్ధమే

June 3, 2026 7:47 AM
shilpa-shinde

నటి శిల్పా షిండే పాపులర్ షో ‘భాబీజీ ఘర్ పర్ హై!’ నిర్వాహకులతో జరిగిన వివాదాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. 2016లో ఆ షో నుండి బయటకు వచ్చిన దాదాపు దశాబ్దం తర్వాత, నిర్మాత సంజయ్ కోహ్లీపై తాను చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అవాస్తవమని ఆ నటి అంగీకరించారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ఈ వివాదం గురించి మాట్లాడుతూ, ఆ సమయంలో తనకు మరో మార్గం లేదని భావించి ఫిర్యాదు చేశానని, ఆ తర్వాత ఆ విషయం రాజీపడటంతో తనకు రావలసిన డబ్బులు కూడా చెల్లించారని శిల్పా తెలిపారు.

నటి భారతి సింగ్, రచయిత హర్ష్ లింబచయ్యాల పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా శిల్పా మాట్లాడుతూ తాను నిజం చెప్పడానికి భయపడడం లేదన్నారు. ఈ విషయం ఎవరికీ తెలియదు, నిజం చెప్పడానికి నేను భయపడను. ఇది చాలా పెద్ద విషయం కాబట్టి ఈ రోజు కూడా ఈ విషయం చెబుతానని తెలిపారు. నాకు వేరే మార్గం లేకపోవడంతో నా నిర్మాతపై లైంగిక వేధింపుల కేసు పెట్టాను. చివరికి, ఆ విషయం రాజీపడటంతో నేను అందులో నుంచి బయటపడ్డానని స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media