టీజీపీఎస్సీ నుంచి 290 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

June 3, 2026 10:33 AM
TGPSC recruitment notification for 290 AEE and Assistant Environmental Engineer posts in Telangana

ఆర్‌అండ్‌బీ శాఖలో 271 ఏఈఈ పోస్టులు

కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ ఖాళీలు

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC 2026) మంగళవారం 290 ఉద్యోగాల భర్తీకి మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ), తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ఈ నియామకాలు చేపట్టనుంది.

మొత్తం ఖాళీల్లో ఆర్‌అండ్‌బీ శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు ఉన్నాయి. అదే శాఖలో మరో 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే పీసీబీలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు.

సాధారణ వర్గ అభ్యర్థులకు కనిష్ఠ వయసు 18 సంవత్సరాలు, గరిష్ఠ వయసు 44 సంవత్సరాలుగా నిర్ణయించారు.

టీజీపీఎస్సీ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్లతో ఇంజినీరింగ్ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు మరో అవకాశం లభించింది.

దరఖాస్తుల షెడ్యూల్ ఇలా..

ఏఈఈ (సివిల్) పోస్టులకు జూన్ 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. జూలై 13 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

ఏఈఈ (ఎలక్ట్రికల్) పోస్టులకు జూన్ 8 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 15 సాయంత్రం 5 గంటలతో గడువు ముగుస్తుంది.

పీసీబీలో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు జూన్ 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 17 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది.

ALSO READ

సెప్టెంబర్‌, అక్టోబర్‌లో పరీక్షలు

TGPSC 2026 ,ఏఈఈ పోస్టుల నియామక పరీక్షలను అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం ఉందని టీజీపీఎస్సీ తెలిపింది. అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టుల పరీక్ష సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశముంది.

పరీక్షల ఖచ్చితమైన తేదీలను తర్వాత ప్రత్యేకంగా ప్రకటించనున్నారు. పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.పరీక్షకు ముందు రోజు సాయంత్రం 5 గంటల వరకు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media