సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న చెర్రీ బాడీగార్డ్
ప్రమోషన్లలో ప్రత్యేక ఆకర్షణగా బాడీగార్డ్
రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రెమ్యునరేషన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది.
అయితే ఈ ప్రమోషనల్ కార్యక్రమాల్లో రామ్ చరణ్ వెంట ఎప్పుడూ కనిపిస్తున్న ఓ వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. చరణ్‌కు రక్షణ కవచంలా కనిపిస్తున్న ఆ కొత్త బాడీగార్డ్ పేరు కెవిన్ కుంటా. వెస్ట్ ఆఫ్రికాకు చెందిన 27 ఏళ్ల కెవిన్ అసలు పేరు అబ్దూ కాదిర్ సోవ్. ప్రస్తుతం ఇటలీలో స్థిరపడిన ఆయన అంతర్జాతీయ స్థాయి ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్. శారీరక దృఢత్వం, భద్రతా నైపుణ్యాలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆయన గురించి ఆరా తీస్తున్నారు.
ఇటీవలి కాలంలో రామ్ చరణ్ హాజరవుతున్న ప్రతి ప్రధాన కార్యక్రమంలో కెవిన్ కనిపిస్తున్నారు. కెవిన్ రామ్ చరణ్‌కి మాత్రమే కాకుండా.. చెర్రీ కుటుంబ సభ్యులకు కెవిన్ బాడీగార్డ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చెర్రీనే చెప్పాడు. అయితే కెవిన్ కొత్తగా నియమించుకున్న బాడీగార్డ్ కాదని.. గత నాలుగు ఏళ్లుగా తనకు సెక్యూరిటీగా ఉన్నాడని కూడా చెర్రీ స్పష్టం చేశాడు.
గ్లోబల్ స్టార్‌కు భద్రత కల్పించే బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ బాడీగార్డ్ పారితోషికం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం.. కెవిన్ సేవల కోసం రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం బయటకు రాలేదు.



