ప్రకాష్ రాజ్ Vs పవన్ కల్యాణ్.. మధ్యలో బండ్ల గణేష్

June 4, 2026 11:44 AM
pawan kalyan bandla ganesh

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రకటించారు. దీనిపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందిస్తూ సెటైరికల్ పోస్ట్ పెట్టారు. “వస్తానంటే వద్దంటామా.. రండి సార్. కానీ అంతకంటే ముందు ఒకటి చెప్పండి. మీరు పొత్తుతో వస్తున్నారా? లేక సింగిల్‌గా వస్తున్నారా? ఊరికే అడుగుతున్నా” అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. దీనికి హ్యాష్‌ట్యాగ్ #JustAsking ను కూడా జత చేశారు.

అయితే నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఎక్స్ వేదికగా చర్చించారు. ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. “నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధాని వా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్!” అంటూ బండ్ల గణేష్ స్పందించాడు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media