ఐపీఎల్ జట్ల ఎంపికలో ఫ్రాంచైజీల యజమానుల జోక్యంపై ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026 సీజన్లో జట్టు ఎంపికలో యాజమాన్యం జోక్యం చేసుకుందని, ఓనర్లకు నచ్చిన ఆటగాడి కోసం తనను పక్కనపెట్టారని ఆరోపించాడు. ఐపీఎల్ 2026 వేలంలో ముంబై ఇండియన్స్‌కు గట్టి పోటీనిచ్చి సలీల్ అరోరా అనే యువ ఆటగాడిని మా ఫ్రాంచైజీ దక్కించుకుంది. అతనంటే మా ఓనర్లకు చాలా ఇష్టం. అతడిని తుది జట్టులో కచ్చితంగా ఆడించాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. ఒక దశలో కెప్టెన్ కమిన్స్ అందుబాటులో లేనప్పుడు మేము ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగాం. అప్పుడు కూడా తనకు అవకాశం రాలేదని లివింగ్‌స్టోన్ అన్నారు. జట్టులో గాయాల వంటివి జరిగితే తప్ప నాకు ఆడే అవకాశం రాదని అర్థమైంది. దాంతో నా ఆలోచనా విధానం కూడా మారిపోయిందని తెలిపారు. కావ్య మారన్ సహ యజమానిగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, 2026 సీజన్లో ప్లేఆఫ్స్ చేరినప్పటికీ ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.

