టీడీపీ రాజ్య సభ సభ్యులు వీరే!!

June 7, 2026 7:24 AM
tdp rajyasabha candidates list

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారికంగా విడుదల చేశారు. జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తరఫున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ బరిలో నిలవనున్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా పారిశ్రామికవేత్త సానా సతీష్, ప్రముఖ విద్యావేత్త, భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ, పార్టీ సోషల్ మీడియా విభాగం ముఖ్య నేతగా ఉన్న చింతకాయల విజయ్‌లను ఎంపిక చేసినట్లు పార్టీ ప్రకటించింది. ఈ ముగ్గురిని చంద్రబాబు తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి స్వయంగా బి-ఫారాలు అందజేశారు. సోమవారం నాడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

పీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. కూటమి పొత్తు ధర్మం ప్రకారం నాలుగు స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించగా, తమ అభ్యర్థిగా జనసేన పార్టీ లింగమనేని రమేష్ పేరును ఖరారు చేసింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media