పెద్ది మూడు రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

June 7, 2026 12:35 PM
peddi movie collections

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 236.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 135.36 కోట్ల భారీ గ్రాస్‌తో అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. రెండో రోజు ఈ వసూళ్లు రూ. 181.8 కోట్లకు చేరాయి. మూడో రోజు కూడా అదే జోరు కొనసాగించి, మొత్తం రూ. 236.7 కోట్ల గ్రాస్‌ను సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లు అయిన బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో కలిపి ఇప్పటివరకు ఏకంగా 4 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media