హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏటా నిర్వహించే బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆస్తమా రోగులకు అందించే ఈ ప్రసాదం పంపిణీ జూన్ 8 రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. మృగశిర కార్తె రాత్రి ప్రవేశిస్తుండటంతో ఈ మార్పు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. జూన్ 9వ తేదీ రాత్రి వరకు ఈ పంపిణీ కొనసాగనుంది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వేసవి తీవ్రత దృష్ట్యా ఫ్యాన్లు, కూలర్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు, సీపీఆర్ బృందాలను సిద్ధంగా ఉంచారు. చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు జూన్ 8 ఉదయం 6 గంటల నుంచి జూన్ 9 రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయి. ఆర్టీసీ బస్సులు, వ్యాన్లలో వచ్చేవారు గాంధీభవన్ లేదా గృహకల్ప వద్ద, ఆటోల్లో వచ్చేవారు షెజాన్ హోటల్ వద్ద దిగి గ్రౌండ్స్‌కు చేరుకోవాలి.

