హైడ్రాకు హిట్లర్ స్ఫూర్తి

June 7, 2026 5:32 PM
hydra hitler revanth reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘హైడ్రా’ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) వ్యవస్థకు జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితో పేరు పెట్టానని స్వయంగా చెప్పారు. బెంగళూరులో నిన్న జరిగిన ‘ది హిందూ’ హడిల్ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చెరువులు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలపై హైడ్రా ఏజెన్సీ తీసుకుంటున్న కఠిన చర్యలను సమర్థించుకుంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైడ్రా అనే పదం హిట్లర్‌కు చాలా ఇష్టమైనది. ఆయన కోర్ టీమ్‌ను హైడ్రా అని పిలిచేవారు, వారు ఎవరినైనా హతమార్చగలరు. అందుకే నేను హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది దీనికి హైడ్రా అని పేరు పెట్టానని అన్నారు. అయితే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్‌కు ‘హైడ్రా’ పేరుతో ఎలాంటి హంతక బృందం లేదని స్పష్టం చేశారు. నాజీ జర్మనీపై బ్రిటన్ వైమానిక దళం జరిపిన బాంబు దాడి ఆపరేషన్‌కు ఆ పేరుందని చరిత్రకారులు చెబుతున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media