పిజ్జా డెలివరీకి వెళ్లిన హైదరాబాదీ.. అమెరికాలో దారుణ హత్య

June 7, 2026 5:45 PM
anshul-kulcha

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో అర్ధరాత్రి పూట పిజ్జాలు డెలివరీ చేస్తుండగా, భారతదేశానికి చెందిన ఒక యువకుడిని కాల్చి చంపారు. మృతుడిని హైదరాబాద్‌కు చెందిన 28 ఏళ్ల అన్షుల్ కుంచాగా గుర్తించారు.ప్లాన్ ప్రకారం ఈ హత్య జరిగిందని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అన్షుల్‌ను తలపై మూడుసార్లు కాల్చి, రోడ్డుపై వదిలేశారని మాకు సమాచారం అందిందని అతని సోదరి తన్వి తెలిపారు.

హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసిన అన్షుల్ కుంచా నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం సంపాదించాడు. అయితే అదనపు ఆదాయం కోసం వారంతాల్లో పార్ట్ టైమ్‌గా పిజ్జా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేవాడు. శనివారం రాత్రి ఒక నిర్జన ప్రదేశానికి పిజ్జా డెలివరీ చేయాలంటూ అన్షుల్‌కు ఒక ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్‌ను నమ్మి అతడు అక్కడికి చేరుకోగానే అన్షుల్ తలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. గతంలో కూడా అమెరికాలో అన్షుల్‌పై ఒకసారి దోపిడీ జరిగింది.. అప్పుడు అతడి చైన్, ఫోన్, డబ్బు లాక్కున్నారని, అయితే ఈసారి ఏకంగా ప్రాణాలు తీశారని అన్షుల్ కుటుంబ సభ్యులు వాపోయారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media