ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించింది. ఇక బౌలింగ్‌లోనూ చెలరేగింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్థాన్ 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. భారత జట్టు కంటే ఇంకా 451 పరుగులు వెనుకబడి ఉంది. అరంగేట్రం చేసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ 3 వికెట్లతో మంచి ప్రదర్శన చేశాడు. 564/8 పరుగుల వద్ద భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) రాణించాడు. సుందర్ హాఫ్ సెంచరీ పూర్తి కాగానే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.
ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ లో రహ్మత్ షా (43 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలోనే టెస్టు క్రికెట్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆఫ్ఘన్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిదితో కలిసి 36 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

