వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు శ్రీసత్యసాయి జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. కాచిగూడ – యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ రైలు హిందూపురం రైల్వేస్టేషన్ వద్ద రెండు ఆవులను బలంగా ఢీకొట్టింది. ఆదివారం ఉదయం కాచిగూడ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో హిందూపురం రైల్వేస్టేషన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆవులను ఢీకొనటంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో లోకో పైలెట్ వందేభారత్ రైలును నిలిపివేశారు.
ఈ ప్రమాదంలో రెండు ఆవులు చనిపోగా ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆవుల కళేబరాలను రైలు పట్టాల నుంచి తొలగించిన రైల్వే అధికారులు రైలును పరిశీలించారు. రైలు ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో సుమారు 30 నిమిషాల తర్వాత వందేభారత్ రైలు అక్కడి నుంచి బయల్దేరి వెళ్లింది.

