దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారతీయులు మరణించారు. ఆగి ఉన్న ట్రక్కును మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు మృతి చెందగా.. 9 మంది గాయపడ్డారు. సాంకేతిక లోపం కారణంగా ఎమిరేట్స్ రోడ్డు మధ్యలో ట్రక్కు అకస్మాత్తుగా ఆగిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అక్కడి పోలీసులు చెప్పారు. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం, సరైన సురక్షిత దూరం పాటించకపోవడం వల్లే వెనుక నుంచి వచ్చి ట్రక్కును బలంగా ఢీకొట్టినట్లు తెలిపారు.
ఈ ఘటనపై దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, స్థానిక అధికారులతో కలిసి బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నట్లు తెలిపారు.


