యువత తమ శక్తి ఏంటో తెలుసుకోవాలి
గడిచిన పదేళ్ల కాలంలో హైదరాబాద్‌ను ఒక గొప్ప ఐటీ కేంద్రంగా మార్చడంలో, టీ-హబ్ (T-Hub) లాంటి ఆవిష్కరణల కేంద్రాన్ని నిర్మించడంలో,ఐకియా (IKEA), మైక్రోసాఫ్ట్ వంటి బహుళజాతి సంస్థలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు సీనియర్ ఐఏఎస్ అధికారి, నాటి ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్.అట్టడుగు వర్గాల కోసం ఎమర్జెన్సీ కాలంలో పోరాడిన తన తండ్రి స్ఫూర్తితో, ప్రభుత్వంలో ఉంటూనే సామాన్యులకు సేవ చేయవచ్చని, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అంతరాలను (digital divide) తగ్గించవచ్చంటోన్న IAS officer Jayesh Ranjan… BNS Media Director మేఘనారెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
ప్రశ్న (మేఘనా రెడ్డి): మీరు లక్నోలో పెరిగారు, ఇంజనీరింగ్, ఎకనామిక్స్ కాకుండా సైకాలజీ చదివారు, కానీ ఐటీ రంగంలో Successfully గా సేవలు ఎలా అందించారు?
సమాధానం (IAS officer Jayesh Ranjan): నేను సైకాలజీతో పాటు ఐఐఎం (IIM) కోల్‌కతాలో మేనేజ్మెంట్ చేశాను. సివిల్ సర్వీసెస్ రాయాలనుకున్నప్పుడు, ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టే ‘జాంబీస్’ (zombies) లాంటి వాళ్ళను చూసి భయపడ్డాను, కానీ బ్యాలెన్స్డ్గా చదివి మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ (IAS) సాధించాను.
రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ గారు..ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన నైపుణ్యాలు నాలో ఉన్నాయని భావించి నన్ను ఎంచుకున్నారు.2014 తర్వాత హైదరాబాద్‌ను ఒక గొప్ప ఐటీ కేంద్రంగా మార్చగలిగాము.
ప్రశ్న: BRS ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి మారినప్పుడు మొదటి 72 గంటలు మీకు ఎలా అనిపించింది?
సమాధానం: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నన్ను పిలిపించారు, కొంచెం ఆందోళనతోనే వెళ్ళాను.But, ఆయన నాతో మాట్లాడుతూ..”గత ప్రభుత్వానికి మీరు మంచి పేరు తెచ్చారు. ఇప్పుడు మా ప్రభుత్వానికి అంతకంటే మెరుగైన ఫలితాలు, పేరు తీసుకురావాలి” అని చెప్పడం నాకు చాలా స్ఫూర్తినిచ్చింది.
ప్రశ్న: ఐకియా (IKEA) ను మొట్ట మొదటిసారిగా మన దేశంలో, అదీ హైదరాబాద్‌కు తీసుకురావడం ఎలా సాధ్యమైంది?
సమాధానం: తొలుత మా ఉన్నతాధికారి ప్రదీప్ చంద్ర గారు బెంగళూరుకు వెళ్లాలనుకున్న ఐకియా (IKEA) ప్రతినిధులను కలిసి హైదరాబాద్‌ను పరిశీలించమని ఒప్పించారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారికి మంచి చోట భూమి కేటాయించారు. నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో పనులన్నీ వేగంగా పూర్తిచేశాను. So, వ్యాపారానికి హైదరాబాద్ అత్యుత్తమ ప్రదేశం అని నిరూపించాము.
ప్రశ్న: టీ-హబ్ (T-Hub) విజయ రహస్యం ఏమిటి? అందులో మీ పాత్ర ఏమిటి?
సమాధానం: ప్రభుత్వమే ఆవిష్కరణల కేంద్రాన్ని స్థాపించడం అప్పట్లో విప్తవాత్మక నిర్ణయం. అయితే, దీన్ని ప్రభుత్వ అధికారులు కాకుండా, బయటి నుంచి అత్యుత్తమ నైపుణ్యం ఉన్న వ్యక్తులను తీసుకువచ్చి ప్రొఫెషనల్ బోర్డ్ ద్వారా నడిపించాలని నేను ఒప్పించాను. ప్రభుత్వం వారికి పూర్తి స్వేచ్ఛ నిచ్చి, రోజువారీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకపోవడం వల్లే టీ-హబ్ ఈ రోజు ప్రపంచానికే రోల్ మోడల్‌గా నిలిచింది.
ప్రశ్న: చివరగా, మా లాంటి యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి?
సమాధానం: ముందుగా మీ గురించి మీరు తెలుసుకోండి. మీకు ఏది సంతోషాన్నిస్తుందో, దేనిలో మీకు నైపుణ్యం ఉందో గుర్తించండి. ఆ మార్గంలో పయనిస్తూ, మీకంటూ ఒక సపోర్ట్ సిస్టమ్‌ను నిర్మించుకోండి.మీ గమ్యాన్ని మీరే నిర్దేశించుకోవాలి, పట్టుదల ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చు.
పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ క్రింది Video ను క్లిక్ చేయండి

