విశాఖకు వైఎస్ జగన్

June 9, 2026 10:15 PM
ys jagan vizag

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలను, అలాగే గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ బుధవారం నాడు విశాఖలో పర్యటించనున్నారు. ఈ ప్రమాదంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన గాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు పార్టీ శ్రేణులు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని స్థానిక వైసీపీ నాయకులను ఆదేశించారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఒక పెద్ద పేలుడు సంభవించింది. 150 టన్నుల లాడిల్ నుండి కరిగిన ఉక్కు ఒక్కసారిగా కిందపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media