మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ‘పెద్ది’ చిత్ర బృందానికి, రామ్ చరణ్‌కు అభినందనలు తెలుపుతూ ఒక ప్రత్యేకమైన పోస్ట్ పెట్టారు.
అల్లు అర్జున్ ట్వీట్ కు రామ్ చరణ్ ఎలా స్పందిస్తాడా అని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలో రామ్ చరణ్ స్పందించారు. అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్‌ను రీ-షేర్ చేస్తూ.. “నీ విషెస్ నాకు, అలాగే మా మొత్తం ‘పెద్ది’ టీమ్‌కు ఎంతో ప్రత్యేకం బన్నీ. థాంక్యూ సో మచ్” అంటూ చరణ్ చెప్పడమే కాకుండా ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రాకా’ కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఈ సోషల్ మీడియా స్పందనపై అల్లు, మెగా అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

