Kakinada: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో తునిలో వారం రోజుల క్రితం మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి ఆడుకోవడానికి బయటకు వెళ్లింది. పెంపుడు కుక్కతో కలిసి బయటకు వెళ్లిన చిన్నారి తిరిగి ఇంటికి రాలేదు. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జ్ఞానేశ్వరితో బయటకు వెళ్లిన పెంపుడు కుక్క మూడు రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది. కానీ చిన్నారి రాలేదు. దీంతో జ్ఞానేశ్వరి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ఆ పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు.
కేసు చేధనలో కీలకంగా మారిన పెంపుడు కుక్క శనివారం (జూన్ 13) మరణించింది. కుక్క ఇంటికి తిరిగి వచ్చిన రోజు నుంచి ఆ కుక్క ఆరోగ్యం కుదుట పడకపోవడంతో వైద్యులు పర్యవేక్షించి ట్రీట్మెంట్ అందించారు. కానీ పరిస్థితి విషమించి కుక్క మృతి చెందింది. విచారణలో కీలకంగా మారిన పెంపుడు కుక్క హఠాన్మరణంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. జీపీఎస్ ట్రాకర్ అమర్చిన వెంటనే కుక్క చనిపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ కుక్కను బయటకు వదిలిన మరుసటి రోజే (శనివారం) అది ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవడం పోలీసులు సైతం షాక్ అవుతున్నారు. మూడేళ్ల జాహ్నవి ఆచూకీ కనిపెట్టేందుకు సుమారు 200 మంది పోలీసు సిబ్బంది, స్నిఫర్ డాగ్స్ రంగంలోకి దిగినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.


