మహిళల టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టుతో భారతజట్టు తొలి మ్యాచ్ ఆడబోతోంది. బర్మింగ్ హామ్ వేదికగా సాగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి సొంతం చేసుకున్న హర్మన్‌ప్రీత్ సేన తాజాగా టీ20 ప్రపంచకప్‌లోనూ అదే జోరును కనబరచాలని ఉవ్విళ్లూరుతోంది. 2009లో మొదలైన టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్ చేరింది. 2020 ఎడిషన్‌లో ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
భారత మహిళ జట్టు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్
పాకిస్థాన్ జట్టు (ప్లేయింగ్ XI): గుల్ ఫిరోజా, మునీబా అలీ(w), అయేషా జాఫర్, సైరా జబీన్, అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, ఫాతిమా సనా(c), రమీన్ షమీమ్, నష్రా సంధు, తస్మియా రుబాబ్, సాదియా ఇక్బాల్


