విజయ్ దేవరకొండ, రష్మిక మందన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘ది దేవరకొండ ఫౌండేషన్’ తరఫున మెరిట్ స్కాలర్‌షిప్‌లను అందజేశారు. బల్మూరు మండలంలోని తుమ్మన్‌పేట విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ స్వగ్రామం.
రష్మికతో వివాహం అనంతరం ఈ గ్రామానికి సతీసమేతంగా విచ్చేసిన విజయ్ అక్కడే తన వెడ్డింగ్ రిసెప్షన్ కూడా జరుపుకున్నారు. ఆ రోజే అచ్చంపేట డివిజన్‌లోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదివే పేద మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ఇస్తానని మాట ఇచ్చారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవ్వగా ఆ నియోజకవర్గంలో 1, 2 ర్యాంకులు సాధించిన 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించి తన మాట నిలబెట్టుకున్నారు. వచ్చే ఏడాది కూడా ‘విజయ్ అన్న వస్తాడు, స్కాలర్‌షిప్ ఇస్తాడు’ అని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పడం విశేషం.


