క్రీడల్లో అత్యంత ప్రభావశీలుల 100 మంది జాబితాలో Smriti Mandhana..
భారతీయుల్లో ఒక్కరే ఎంపిక
న్యూయార్క్: Smriti Mandhana ,భారత మహిళల క్రికెట్ జట్టు ఉప కెప్టెన్ టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన 2026 ఏడాది క్రీడల్లో అత్యంత ప్రభావశీలులైన 100 మంది జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో చోటు సంపాదించిన ఏకైక భారతీయురాలు ఆమెనే.
క్రీడా ప్రపంచాన్ని ప్రస్తుతం ప్రభావితం చేస్తున్న క్రీడాకారులు, కోచ్‌లు, ఉద్యమకారులు, పెట్టుబడిదారులను ఎంపిక చేస్తూ టైమ్ ఈ జాబితాను రూపొందించింది.
క్రిస్టియానో రొనాల్డో, దక్షిణాఫ్రికా క్రికెట్ కెప్టెన్ టెంబా బవుమా, న్యూయార్క్ నిక్స్ బాస్కెట్‌బాల్ ఆటగాడు జేలెన్ బ్రన్‌సన్, ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినో వంటి ప్రముఖులు కూడా జాబితాలో చోటు దక్కించుకున్నారు.
Smriti Mandhana రికార్డుల పరంపర:
29 ఏళ్ల Smriti Mandhana గురించి టైమ్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. దేశవాళీ వన్డే క్రికెట్‌లో ద్విశతకం సాధించిన తొలి భారత మహిళగా, అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన తొలి భారత మహిళగా ఆమె నిలిచారని పేర్కొంది.
ఒక క్యాలెండర్ ఏడాదిలో వెయ్యికి పైగా వన్డే పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా కూడా మంధానా గుర్తింపు పొందారు.
జట్టు విజయాలపైనే గర్వం
వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయాలే తనకు ఎక్కువ సంతోషం కలిగిస్తాయని మంధానా భావిస్తారని టైమ్ పేర్కొంది. ఆమె నాయకత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2024, 2026 మహిళల ప్రీమియర్ లీగ్ టైటిళ్లు గెలుచుకుంది.
2024లో మహిళల క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల కలిపి అత్యధిక అంతర్జాతీయ పరుగుల రికార్డు నెలకొల్పిన మంధానా, గత ఏడాది తన రికార్డునే అధిగమించారు.
అదే ప్రదర్శనతో 2025 ఏడాదికి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ అవార్డు కూడా అందుకున్నారు.



