“This was not easy” అంటూ Trump వ్యాఖ్య.. అమెరికా అధ్యక్షుడి మాటల అర్ధమేంటి.?
పారిస్ : US-IRAN యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. అమెరికా అధ్యక్షుడు Trump,ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ఒక తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరింది.
14 అంశాలతో కూడిన శాంతి ఒప్పందంపై సంతకం ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఒప్పందంలోని ప్రధాన అంశాలు:
- అమెరికా–ఇరాన్ మధ్య శత్రుత్వ చర్యలకు ముగింపు.
- ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయబోమని అంగీకరించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
- కీలక సముద్ర మార్గమైన Strait of Hormuz తిరిగి తెరవడం.
- ఇరాన్‌పై కొన్ని ఆర్థిక ఆంక్షల సడలింపు
- తుది అణు ఒప్పందం కోసం 60 రోజుల చర్చల ప్రక్రియ ప్రారంభం
- ప్రపంచంపై యుద్ధం ప్రభావం
- చమురు సరఫరా అంతరాయం తగ్గుతుందనే అంచనాలతో అంతర్జాతీయ చమురు ధరలు పడిపోవడం వంటి అంశాలున్నాయి.
China ఈ ఒప్పందాన్ని స్వాగతించింది.అయితే ఇది ఇంకా తుది ఒప్పందం కాదు;
14 అంశాల అమలు, అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత వంటి వాటిపై వచ్చే 60 రోజులు కీలకం కానున్నాయి.
ఈ ఒప్పందం ప్రస్తుతం ఒక అవగాహన మాత్రమే. పూర్తి స్థాయి శాంతి, అణు ఒప్పందం కోసం ఇంకా చర్చలు జరగాల్సి ఉంది. అందువల్ల ఇది పెద్ద దౌత్యపరమైన ముందడుగు అయినప్పటికీ, పరిస్థితి ఇంకా పూర్తిగా స్థిరపడలేదు.
అయితే ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే…ఒప్పంద పత్రంపై సంతకం చేస్తూనే అమెరికా అధ్యక్షుడు Trump “This was not easy” (“ఇది అంత సులభం కాదు”) అని వ్యాఖ్యానించారు. ఇదే అంశం ఇప్పుడు చర్చానీయాంశమైంది.



