మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్: ORR పై తన మైనర్ కుమారుడితో లగ్జరీ కారు నడిపించిన తండ్రిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మైనర్ బాలుడు ఎంజీ సైబర్‌స్టర్ (MG Cyberster) కారును ORRపై నడుపుతున్నాడని ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు.
(ORR)వైరల్ వీడియో ఆధారంగా వాహనం స్వాధీనం:
రాజేంద్రనగర్ పరిధిలోని ORR పై బాలుడు కారు నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, వాహనం, యజమానిని గుర్తించారు.
ఆ తర్వాత కారును స్వాధీనం చేసుకుని, మైనర్ కుమారుడికి వాహనం నడిపేందుకు అనుమతిచ్చినందుకు తండ్రిపై కేసు నమోదు చేశారు.
మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల వారి ప్రాణాలతో పాటు ఇతర వాహనదారుల భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు.



