Medak జిల్లాలో వెలుగుచూసిన మోసం..
మెదక్: Medak జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి పేరుతో ఇద్దరు యువతులను మోసం చేసి నగదు, బంగారం కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, తొలి ఘటనలో నిందితుడు తనను రిథ్విక్ రెడ్డి అనే ఐపీఎస్ ట్రైనీగా పరిచయం చేసుకున్నాడు. ట్రైనింగ్ పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. తర్వాత తనకు కొన్ని ఖర్చులు ఉన్నాయని చెప్పి రూ.5 లక్షల నగదు, 10 గ్రాముల బంగారం ఇవ్వాలని కోరాడు.
ఆ నగదు, బంగారాన్ని ఉప్పరి దుర్గేష్ సాగర్ అనే వ్యక్తికి ఇవ్వాలని సూచించాడు. బాధితురాలు చెప్పిన ప్రకారం, దుర్గేష్ సాగర్ పేరుతో వచ్చిన వ్యక్తికే నగదు, బంగారం అప్పగించింది.
ఆ వ్యక్తే అసలు నిందితుడై ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేసింది.
మరో ఘటనలో నిందితుడు తనను సాత్విక్ రెడ్డిగా పరిచయం చేసుకుని, తాను ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్నని 17 ఏళ్ల ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన యువతిని నమ్మించాడు. కొద్దిరోజుల పరిచయం తర్వాత త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. చదువు పూర్తిచేసుకోవడానికి ఆర్థిక సహాయం అవసరమని చెప్పి రూ.7 లక్షల నగదు, ఒక తులం బంగారం తీసుకున్నాడు.
తర్వాత మోసపోయామని గుర్తించిన ఇద్దరు యువతులు టేక్మాల్ పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన Medak పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇదే తరహాలో మరికొందరు మహిళలను కూడా మోసం చేశాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



