MODI టూర్స్ … జస్ట్ ఒక స్టాటిస్టిక్ కాదు, భారత బ్రాండ్ బిల్డింగ్..

June 19, 2026 4:17 PM
Modi during an overseas diplomatic visit.

ప్రవాస భారతీయుల నుంచి జీ20 వరకు.. ప్రపంచ వేదికపై భారత్ ప్రభావం పెరిగిందా?

INDIA: భారత ప్రధాని నరేంద్ర MODI 100వ విదేశీ పర్యటన పూర్తి చేశారు. జూన్ 2014లో భూటాన్ పర్యటనతో ప్రారంభమైన ఈ ప్రయాణం, గత 12 ఏళ్లలో భారత విదేశాంగ విధానంలో వచ్చిన మార్పులకు ప్రతీకగా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

MODI విదేశీ పర్యటనల్లో ప్రవాస భారతీయులతో భారీ స్థాయిలో సమావేశాలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

2014 సెప్టెంబర్ 28న న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు, 2015లో లండన్ వెంబ్లీ స్టేడియం, 2019లో అమెరికాలో జరిగిన “హౌడీ మోడీ” సభ, 2024లో యూఏఈలో నిర్వహించిన “అహ్లాన్ మోడీ” కార్యక్రమం వరకు కొనసాగాయి.

ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రవాసులను భారత్‌కు అనుకూల సాఫ్ట్ పవర్‌గా మలచడంలో ఇవి కీలక పాత్ర పోషించాయని పరిశీలకులు భావిస్తున్నారు.

గ్లోబల్ స్టేజ్‌పై MODI డిప్లమసీ:

అంతర్జాతీయ నాయకులతో వ్యక్తిగత సంబంధాలు కొనసాగించడం కూడా మోడీ దౌత్య శైలిలో ప్రధాన అంశంగా నిలిచింది.

మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, మధ్యప్రాచ్య దేశాల నాయకులతో సన్నిహిత సంబంధాలు సృష్టించేందుకు ప్రయత్నించారని విశ్లేషణలు సూచిస్తున్నాయి.

విదేశీ పర్యటనల సందర్భంగా మోడీకి పలు దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలు అందించాయి.

2016లో సౌదీ అరేబియా “ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్”, రష్యా “ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ”, 2023లో ఈజిప్ట్ “ఆర్డర్ ఆఫ్ ది నైల్”, ఫ్రాన్స్ “లీజియన్ ఆఫ్ హానర్”, గ్రీస్ “గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్” పురస్కారాలు ప్రదానం చేశాయి.

మొత్తంగా చూస్తే, ప్రధాని MODI 100వ విదేశీ పర్యటన కేవలం ఒక గణాంకం మాత్రమే కాకుండా, ప్రపంచ వేదికపై భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నాలకు ప్రతీకగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media