Falcon మోసం.. Worldline అధికారి అరెస్ట్..

June 20, 2026 10:37 AM
Worldline executive arrested in Falcon fraud investigation.

Falcon Fraud : రూ.4,215 కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు వేగం

హైదరాబాద్: బహుళ కోట్ల Falcon Invoice Discounting మోసం కేసులో Mumbai కేంద్రంగా పనిచేస్తున్న Worldline E-Payment Gateway సంస్థ Executive Vice President షేక్ మొహిదీన్ (46)ను తెలంగాణ CID అధికారులు అరెస్ట్ చేశారు.

CID తెలిపిన వివరాల ప్రకారం, Falcon ప్లాట్‌ఫామ్ ప్రముఖ బహుళజాతి కంపెనీల పేర్లతో నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పథకాలను చూపించి పెట్టుబడిదారులను ఆకర్షించింది.

తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని హామీ ఇచ్చి భారీగా పెట్టుబడులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దర్యాప్తు ప్రకారం, దేశవ్యాప్తంగా 7,056 మంది పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ.4,215 కోట్లు సేకరించినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 4,000 మందికిపైగా బాధితులు కలిపి సుమారు రూ.792 కోట్లు నష్టపోయినట్లు సమాచారం.

ఈ కేసులో ప్రధాన నిందితులకు షేక్ మొహిదీన్ పేమెంట్ గేట్‌వే సేవలు అందించడం ద్వారా కార్యకలాపాలకు సహకరించినట్లు CID వెల్లడించింది. అలాగే Worldline E-Payment Gateway ఈ ప్లాట్‌ఫామ్ లావాదేవీల ద్వారా సుమారు రూ.7.53 కోట్ల ట్రాన్సాక్షన్ ఆదాయం పొందినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

అరెస్ట్ చేసిన షేక్ మొహిదీన్‌ను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media