ఇసుక ఎగుమతులు, రిజిస్ట్రేషన్లు, రవాణా ఆదాయంపై Congress Govt ప్రత్యేక దృష్టి..
హైదరాబాద్: రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు Congress Govt కొత్త మార్గాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా పర్యాటక అభివృద్ధి, ఇసుక ఎగుమతులు, రిజిస్ట్రేషన్ ఆదాయం, రవాణా శాఖ వసూళ్లను పెంచే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ ఉపసంఘ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న వనరుల నుంచి గరిష్ఠ ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
PPP విధానంలో పర్యాటక అభివృద్ధి
పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో పర్యాటక రంగాన్ని విస్తరించే అంశంపై సమావేశంలో చర్చించారు. ఆలయ పర్యాటకం, ఎకో టూరిజం, ఆరోగ్య పర్యాటకానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
వారాంతాల్లో హెలికాప్టర్ టూరిజం నిర్వహించే ప్రతిపాదనలు, శ్రీశైలం, నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్స్ ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు.
ఇసుక ఎగుమతులపై అధ్యయనం
లోయర్ మానేరు, అప్పర్ మానేరు, మేడిగడ్డ రిజర్వాయర్లలో డీ సిల్టింగ్ పనులను కూడా ఉపసంఘం సమీక్షించింది. నిబంధనలు పాటించే క్రషర్ యూనిట్లకు రోబో సాండ్ తయారీకి సూత్రప్రాయంగా అనుమతి ఇవ్వాలని Congress Govt నిర్ణయించింది.
అలాగే పొరుగు రాష్ట్రాలకు ఇసుక ఎగుమతులు చేసే అవకాశాలపై సాధ్యాసాధ్యాల అధ్యయనం చేయాలని అధికారులకు సూచించింది.
రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖపై Congress Govt సమీక్ష:
భూముల స్లాబ్ విలువలను సవరించిన తర్వాత రిజిస్ట్రేషన్లు పెరిగినట్లు సమావేశంలో అధికారులు వివరించారు.
రవాణా శాఖ ఆదాయాన్ని పెంచే చర్యలపైనా చర్చ జరిగింది. భారత్ (BH) సిరీస్ వాహనాల రిజిస్ట్రేషన్, పన్నులకు సంబంధించిన చట్టపరమైన, విధానపరమైన అంశాలను సమీక్షించారు. ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాల రవాణా మంత్రులతో సమావేశం నిర్వహించాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.



