డైరెక్టర్(Narahari Rao) బ్యాంక్ లాకర్‌లో రూ.1.5 కోట్లు స్వాధీనం

June 20, 2026 3:38 PM
ACB officials seize cash from Narahari Rao 's bank locker.

ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించిన అధికారులు,

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసు దర్యాప్తులో Anti-Corruption Bureau (ACB) అధికారులు మరో భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. Survey and Land Records శాఖ మల్టీ-జోన్-II డిప్యూటీ డైరెక్టర్ Sunkari Narahari Rao నిర్వహిస్తున్న బ్యాంక్ లాకర్‌లో రూ.1.5 కోట్ల నగదు లభించింది.

శనివారం ఏసీబీ అధికారులు నరహరి రావును షాహాలీబండ లోని ఓ బ్యాంక్‌కు తీసుకెళ్లి లాకర్‌ను తెరిచారు. తనిఖీల్లో రూ.1.50 కోట్ల నగదు బయటపడటంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇంతకుముందు మంగళవారం నరహరి రావుకు సంబంధించిన 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు, రూ.30 కోట్లకు పైగా విలువైన Narahari Rao ‘s ఆస్తులను గుర్తించారు.

Narahari Rao పై ఏసీబీ దర్యాప్తు ఎలా మొదలైంది.?

ఈ కేసులో భాగంగా జూన్ 17Anti-Corruption Bureau (ACB) అధికారులు హైదరాబాద్‌తో పాటు మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుంకరి నరహరి రావుకు సంబంధించిన రూ.30 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

అనంతరం నరహరి రావుపై అక్రమాస్తుల (Disproportionate Assets) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే దర్యాప్తులో భాగంగా శనివారం షాహాలీబండలోని బ్యాంక్ లాకర్‌ను తెరిచి పరిశీలించగా రూ.1.5 కోట్ల నగదు బయటపడింది. కేసులో మరిన్ని ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నరహరి రావుపై అక్రమాస్తుల (Disproportionate Assets) కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తూ, అదనపు సోదాలు కూడా నిర్వహిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media