మానసిక ప్రశాంతత కోసం కొంతకాలం సోషల్ మీడియా నుంచి దూరం..
చెన్నై: Kayadu Lohar సోషల్ మీడియాకు కొంతకాలం విరామం ప్రకటించారు. శారీరక విశ్రాంతి ఎంత అవసరమో, మనసుకూ అంతే విశ్రాంతి అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.
తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన సందేశంలో, “కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కొన్నిసార్లు మనసుకూ శరీరానికి ఇచ్చే విశ్రాంతిలాగే విశ్రాంతి అవసరం అవుతుంది. కాస్త నెమ్మదిగా సాగుతూ, సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండి, నిజ జీవితంలో నాతో నేనే ఎక్కువ సమయం గడపాలని అనిపిస్తోంది” అని చెప్పారు.
తనకు ఇప్పటివరకు ప్రేమ, ఆదరణ చూపించిన అభిమానులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. “మీ సందేశాలు, ప్రేమ నాకు ఎంతో విలువైనవి. నేను కొంతకాలం సోషల్ మీడియాలో కనిపించను. అయితే ముఖ్యమైన సమాచారం ఉంటే నా టీమ్ ఈ ఖాతా ద్వారా పంచుకుంటుంది. అందరికీ ప్రశాంతత, ఆనందం, మంచితనం కలగాలని కోరుకుంటున్నాను. త్వరలో మళ్లీ కలుద్దాం” అని పేర్కొన్నారు.
గత నెలలో తన తమ్ముడు ఉదయ్ పుట్టినరోజు సందర్భంగా కూడా కాయడు లోహర్ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “నువ్వెంత పెద్దవాడైనా నాకు ఎప్పటికీ చిన్న తమ్ముడివే. జీవితంలో మరేదైనా అవ్వకముందే నేను అక్కనయ్యాను” అని ఆమె రాశారు.
‘ఇమ్మోర్టల్’లో kayadu lohar :
ప్రస్తుతం కాయడు లోహర్ దర్శకుడు మారియప్పన్ చిన్న తెరకెక్కిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘Immortal’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో G V Prakash Kumar హీరోగా కనిపించనున్నారు.



