అపార్ట్‌మెంట్ టెర్రస్ నుంచి పడిపోయి విద్యార్థిని మృ*తి..

June 23, 2026 11:16 AM
Student falls from apartment terrace in Hyderabad accident scene

Miyapur లో జరిగిన ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు,

19 ఏళ్ల కాలేజ్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణం..,

Hyderabad : Miyapur ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల కాలేజ్ విద్యార్థిని అపార్ట్‌మెంట్ భవనం 5వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు ప్రణమ్య. ప్రతాప్ రెడ్డి, ప్రశాంతి దంపతుల కుమార్తె. మయూరి నగర్ ప్రాంతానికి చెందిన ఆమె స్థానిక ప్రైవేట్ కాలేజ్‌లో డిగ్రీ చదువుతోంది.

ఫోన్‌లో మాట్లాడుతుండగా బ్యాలెన్స్ కోల్పోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు,

కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ప్రణమ్య ఫోన్‌లో మాట్లాడుకుంటూ అపార్ట్‌మెంట్ 5వ అంతస్తుకు వెళ్లినట్లు సమాచారం. అక్కడ పారాపెట్ వాల్‌కు ఆనుకుని నిలబడిన సమయంలో బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ ఘటనలో ఆమెకు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటన Miyapur ప్రాంతంలో కలకలం రేపింది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media