వైభవ్ సూర్యవంశీకి టీమిండియా జెర్సీ..!

June 23, 2026 3:40 PM
Vaibhav Suryavanshi receiving Team India jersey emotionally

15 ఏళ్లలోనే భారత జట్టులో చోటు సాధించిన యువ సంచలనం

బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో భావోద్వేగ దృశ్యాలు..

INDIA: భారత యువ సంచలనం Vaibhav Suryavanshi.. 15 ఏళ్ల వయసులోనే National team కు ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ tour కోసం ప్రకటించిన భారత జట్టులో అతడు Place సంపాదించుకున్నాడు.

తాజాగా వైభవ్ టీమిండియా జెర్సీని అందుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ఎక్స్ లో Video release చేసింది. ‘యావత్ దేశం ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. వైభవ్ సూర్యవంశీ భారత జెర్సీని అందుకున్నాడు’ అంటూ బీసీసీఐ ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది.

భారత జట్టు త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు చేతుల మీదుగా వైభవ్ జెర్సీని అందుకున్నాడు.జెర్సీని చూసిన వెంటనే అతడి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది.

వైభవ్ సూర్యవంశీ Emotions కు గురయ్యాడు. ‘నేను Firs time బ్యాట్ పట్టిన రోజు నుంచి భారత జట్టు తరఫున ఆడాలని కల కనేవాడిని. ఆ dream ఇప్పుడు నిజమైంది. ఈ feelingsను మాటల్లో వర్ణించలేను. జెర్సీని చూసిన క్షణం నుంచి నా ఆనందానికి అవధులు లేవు. ఇదంతా ఓ కలలా అనిపిస్తోంది. ఎప్పుడూ ఊహించని విషయం ఒక్కసారిగా నిజమైతే ఎలా స్పందించాలో తెలియదు. ప్రస్తుతం నేను అదే పరిస్థితుల్లో ఉన్నా’ అని వైభవ్ అన్నాడు. Vaibhav Suryavanshi కు భారత జట్టులో జెర్సీ నెంబర్-03 కేటాయించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media