మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ను ఇమిటేట్ చేసిన సీఎం విజయ్
విజయ్ ఇమిటేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
తమిళనాడు పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. అసెంబ్లీ సాక్షిగా సీఎం విజయ్, ప్రతిపక్ష డీఎంకే మధ్య ఊహించని రేంజ్‌లో హైడ్రామా నడిచింది. డీఎంకే టార్గెట్‌గా సీఎం విజయ్ వేసిన పంచ్‌లు, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ మ్యానరిజమ్‌ను ఆయన ఇమిటేట్ చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విజయ్ దెబ్బకు తట్టుకోలేక డీఎంకే ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం విజయ్ మాట్లాడుతుండగా.. డీఎంకే సభ్యులు గొడవ చేస్తూ అడ్డుతగిలారు. దాంతో విజయ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కొందరు పార్టీ నిధుల పేరుతో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. మేము ప్రజల సొమ్మును ఒక్క రూపాయి కూడా లూటీ చేయం. బయటపడే ప్రతి అవినీతి కేసును వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ఎవరినీ స్పేర్ చేయం” అంటూ సీఎం విజయ్ వార్నింగ్ ఇచ్చారు.
స్టాలిన్ స్టైల్‌ను దించేసిన విజయ్!
ఈ స్పీచ్ మధ్యలో సీఎం విజయ్.. స్టాలిన్ గతంలో చేసిన ఒక వైరల్ హ్యాండ్ గెస్టర్‌ను అచ్చు గుద్దినట్టు చేసి చూపించారు. గతంలో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు పూర్తయ్యాక, స్టాలిన్ “అంతా అయిపోయింది/సెటిల్ అయింది” అన్నట్టుగా చేతిని పైకెత్తి ఒక సైగ చేశారు. ఆ వీడియో అప్పట్లో విపరీతంగా ట్రోల్ అయింది. ఇప్పుడు అదే సైగను విజయ్ అసెంబ్లీలోనే రిపీట్ చేయడంతో.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చప్పట్లతో సభను హోరెత్తించారు. దీనికి సంబంధించిన క్లిప్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది.
‘హార్స్ ట్రేడింగ్’ ఆరోపణలపై స్ట్రాంగ్ కౌంటర్
లెఫ్ట్ పార్టీలు (CPI-M), ముస్లిం లీగ్ (IUML) తమ వైపు రావడంపై డీఎంకే చేస్తున్న ‘హార్స్ ట్రేడింగ్’ ఆరోపణలను విజయ్ తిప్పికొట్టారు. ఆ పార్టీలు తమ సొంత నిర్ణయంతో మాకు మద్దతు ఇచ్చాయి. కానీ డీఎంకే మాత్రం మేమేదో వాళ్ళని లాగేసుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తోంది అని మండిపడ్డారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ సమస్యలపై డీఎంకే చేస్తున్న విమర్శలన్నీ పొలిటికల్ స్టంట్స్ మాత్రమేనని విజయ్ కొట్టిపారేశారు. ఈ సమస్యలన్నీ డీఎంకే హయాం నుంచే ఉన్నాయని, తాము వాటిని క్లీన్ చేస్తున్నామని చెప్పారు. అంతేకాదు, టాస్మాక్ (మద్యం అమ్మకాలు) లో జరుగుతోన్న దాదాపు ₹1,600 కోట్ల భారీ రెవెన్యూ లీకేజీ నెట్‌వర్క్‌ను బద్దలు కొడతామని, అవినీతి తిమింగలాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.



