హైదరాబాద్, నిజామాబాద్లో ఏకకాలంలో సోదాలు
పలు కీలక పత్రాలు స్వాధీనం.. అధికారిని అదుపులోకి తీసుకున్న ACB
హైదరాబాద్: ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో Nizamabad జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. మల్లా రెడ్డి నివాసాలు, కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ (ACB) మంగళవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
ఫిర్యాదు ఆధారంగా డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక ACB బృందాలు హైదరాబాద్లోని మల్లా రెడ్డి నివాసం, Nizamabad లోని ప్రగతి నగర్లో ఉన్న ఇల్లు, సుభాష్ నగర్లోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టాయి.
సోదాల సమయంలో ఎక్సైజ్ కార్యాలయం నుంచి పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మల్లా రెడ్డి ఇళ్లలో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, రికార్డులు, ఇతర విలువైన వస్తువులను పరిశీలన కోసం సేకరించారు.
దర్యాప్తులో భాగంగా ACB అధికారులు మల్లా రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పలు ప్రాంతాల్లో సోదాలు, స్వాధీనం చేసుకున్న పత్రాల పరిశీలన కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న పత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత గుర్తించిన ఆస్తుల వివరాలు, దర్యాప్తు ఫలితాలను ACB అధికారికంగా వెల్లడించనుంది.



