“Congress Hatao, Singareni Bachao” పిలుపు.. :Harish Rao

June 24, 2026 11:16 AM
Harish Rao addressing SCCL workers meeting in Kothagudem

కోల్ గణాంకాలపై ప్రశ్నలు..!

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు..,

Kothagudem: సింగరేణి కంపెనీని రక్షించేందుకు అన్ని లేబర్ యూనియన్లు, ఉద్యోగులు కలిసి పోరాడాలని మాజీ మంత్రి T. Harish Rao పిలుపు ఇచ్చారు. కొత్తగూడెంలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “Congress Hatao, Singareni Bachao” అనే నినాదంతో ఉద్యమం సాగాలని ఆయన సూచించారు.

సింగరేణిని భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

కోల్ గణాంకాలపై ప్రశ్నలు:

సింగరేణిలో భారీ అవినీతి జరిగిందని T Harish Rao ఆరోపించారు. కోల్ మిస్సింగ్‌పై సీబీఐ, కేంద్ర విజిలెన్స్ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఎలా మాయమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. గతంలో రోజుకు 40 వేల టన్నుల కోల్ తగ్గినట్లు రికార్డులు చూపిస్తున్నాయని చెప్పారు.

తెలంగాణ జెన్‌కో వద్ద ఉండాల్సిన 25 లక్షల టన్నుల కోల్‌కు బదులు కేవలం 6 లక్షల టన్నులు మాత్రమే ఉన్నాయని, ఇది 76 శాతం లోటు అని ఆయన వివరించారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో 11 లక్షల టన్నుల అవసరానికి 2 లక్షల టన్నులు మాత్రమే ఉన్నాయని, 82 శాతం లోటు ఉందని Harish Rao తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు:

ప్రధానమంత్రి కాకుండా కేంద్ర మంత్రి G Kishan Reddy, సీఎం A Revanth Reddy కలిసి సింగరేణిని నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

సింగరేణి ప్రైవేటీకరణ దిశగా వెళ్తోందని, అంబానీ, అదానీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు.

కోల్ ఉత్పత్తి కూడా తగ్గిందని ఆయన చెప్పారు. 2023లో బీఆర్‌ఎస్ పాలనలో 70 మిలియన్ టన్నులు ఉత్పత్తి జరిగితే, 2025–26లో అది 58 మిలియన్ టన్నులకు పడిపోయిందని వివరించారు.

సీపీఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు ప్రభుత్వ వాదనకు మద్దతు ఇవ్వడంపై కూడా ఆయన స్పందించారు. సింగరేణి నిజ పరిస్థితిని పరిశీలించాలని ఆయన కోరారు.

సింగరేణి గతంలో బాగా అభివృద్ధి చెందిందని, 16,000 డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చారని, బోనస్‌లు పెంచారని ఆయన గుర్తు చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media