హైదరాబాద్ ట్రై-కమిషనరేట్ పరిధిలోనే 90% కేసులు నమోదు
డిజిటల్ ఫ్రాడ్స్, రియల్ ఎస్టేట్ స్కామ్స్‌లో భారీ పెరుగుదల..
Telangana: IT పవర్‌హౌస్‌గా గ్లోబల్ మ్యాప్‌లో ట్రెండ్ అవుతున్న మన తెలంగాణ, ఇప్పుడు ఎకనామిక్ క్రైమ్స్‌లోనూ దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్ కొట్టేసి షాకింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లేటెస్ట్ డేటాని లోతుగా విశ్లేషిస్తే అసలు సిసలైన నంబర్స్ గేమ్ మైండ్ బ్లాక్ చేస్తోంది. 2023లో 26,881 కేసులు ఉంటే, 2024 నాటికి అది ఏకంగా 45.6శాతం పెరిగి 39,127 కేసులకు చేరింది.
ఇండియా మొత్తం మీద జరిగిన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్‌లో 18.2 శాతం వాటా ఒక్క మన తెలంగాణదే. అంటే దేశవ్యాప్తంగా ప్రతి ఐదు ఆర్థిక నేరాల్లో ఒకటి ఇక్కడే జరుగుతోంది. ఇంకా ఘోరమైన అనాలసిస్ ఏంటంటే.. ప్రతి లక్ష జనాభాకు జరిగే నేరాల రేటు తెలంగాణలో 102.1 గా నమోదైంది. ఇది జాతీయ సగటు 15.3 కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువ. కేరళ (36.3), రాజస్థాన్ (33.6) లాంటి పెద్ద స్టేట్స్ మన దరిదాపుల్లో కూడా లేవు. మన స్టేట్‌లో రోజుకు యావరేజ్‌గా 108 కేసులు ఫైల్ అవుతున్నాయంటే, ప్రతి గంటకూ నలుగురు ఐదుగురి వాలెట్లకు కన్నాలు పడుతున్నాయి.
ఇంత భారీగా గ్రాఫ్ పెరగడానికి క్రిమినల్స్ పెరగడం ఒకెత్తయితే, ఇక్కడి పోలీసింగ్ లిబరల్ రిజిస్ట్రేషన్ పాలసీ మరో కారణం. బాధితుడు స్టేషన్‌కి రాగానే ఎలాంటి ఆలస్యం లేకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తుండటంతో దాగి ఉండాల్సిన బ్లాక్ నంబర్స్ అన్నీ అఫీషియల్‌గా బయటకు వస్తున్నాయి.
అయితే ట్విస్ట్ ఏంటంటే, ఈ మోసాలు ఎక్కడో రూరల్ ఏరియాల్లో కాదు.. మోస్ట్ లగ్జరీ అండ్ టెక్-సావీ జోన్స్ అయిన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రై-కమిషנరేట్ల పరిధిలోనే 90శాతం పైగా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఇక్కడే స్కామర్లు జనం లోని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ ని, ఈజీ మనీ మైండ్‌సెట్‌ని పర్ఫెక్ట్‌గా క్యాష్ చేసుకుంటున్నారు.
మొత్తం 39,127 కేసుల్లో ఏకంగా 98శాతం అంటే 38,312 కేసులు కేవలం ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ అనే బిగ్ త్రీ కేటగిరీల కిందకే రావడం గమనార్హం. ఇందులో అత్యధికంగా రియల్ ఎస్టేట్ ప్రీ-లాంచ్ మాఫియా, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్ రాజ్యమేలుతున్నాయి.
కేవలం చిన్న మొత్తాల మోసాలే కాదు ….. రూ.1 కోటి నుండి రూ.10 కోట్ల మధ్య జరిగిన హై-ప్రొఫైల్ స్కామ్స్ 211 రికార్డయ్యాయి, అలాగే రూ.25 కోట్ల పైబడిన మెగా ఫ్రాడ్స్ కూడా డజన్ల కొద్దీ ఉన్నాయి. అందుకే హైదరాబాద్ పోలీసులు రూ.75 లక్షలు దాటిన ప్రతి కేసును స్పెషల్ ఆర్థిక నేరాల విభాగం (EOW)కి బదిలీ చేసి అసెట్స్ అటాచ్మెంట్ వరకు వెళ్తున్నారు.



