ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు రావాలని.. ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి.. ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ అధికారికంగా ఆహ్వానం పంపారు. ఫిబ్రవరిలో టెహ్రాన్‌పై జరిగిన యూఎస్-ఇజ్రాయెల్ జాయింట్ ఎయిర్ స్ట్రైక్స్‌లో ఖమేనీ చనిపోయారు. మిడిల్ ఈస్ట్‌లో.. గొడవల వల్ల అప్పట్లో వాయిదా పడిన ఈ అంత్యక్రియల ఏర్పాట్లను ఇరాన్ గవర్నమెంట్ ఇప్పుడు ఫైనల్ చేసింది.
ఈ అంత్యక్రియల షెడ్యూల్ ప్రకారం.. జూలై 4, 5 తేదీల్లో ఖమేనీ పార్థివదేహాన్ని టెహ్రాన్ లోని ‘గ్రాండ్ మొసల్లా కాంప్లెక్స్’ లో పబ్లిక్ విజిట్ కోసం ఉంచనున్నారు. జూలై 6న క్యాపిటల్ సిటీ టెహ్రాన్‌లో భారీ అంతిమయాత్ర నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇరాక్‌లోని పవిత్ర నగరాలు నజఫ్, కర్బలాలో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. చివరగా జూలై 9న ఖమేనీ స్వస్థలమైన ‘మషద్’ లో ఉన్న ఫేమస్ ఇమామ్ రెజా మసీదులో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
అయితే ఖమేనీ అంత్యక్రియల నేపథ్యంలో.. మూడు రోజులు టెహ్రాన్ ప్రావిన్స్‌లో పబ్లిక్ హాలిడేస్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దాదాపు లక్షలాది మంది ప్రజలు పాల్గొనవచ్చని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఖహేనీ అంత్యక్రియల సందర్భంగా పొరుగు దేశాలకు ఇరాన్ ఆహ్వానాలు పంపింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్, సిరియా, రష్యా, చైనా సహా పలు దేశాలకు ఆహ్వానాలు అందించింది.



