CID, ACB, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్‌లో కీలక మార్పులు
సైబరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సిద్ధిపేట సహా పలు జిల్లాల్లో అధికారుల నియామకాలు
హైదరాబాద్: Telangana Govt సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 36 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) అధికారులను బదిలీ చేస్తూ కొత్త పోస్టింగ్‌లు జారీ చేసింది.
ఈ బదిలీల్లో భాగంగా CID, ACB, Intelligence, Special Branch వంటి కీలక విభాగాలతో పాటు పలు కమిషనరేట్లు, జిల్లాల్లో అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. సైబరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సిద్ధిపేట, రామగుండం ప్రాంతాలు కూడా ఈ మార్పుల్లో ఉన్నాయి.
కొత్త పోస్టింగ్‌ల ప్రకారం పి. శ్రీశైలం ACP, CCS, నిజామాబాద్‌గా నియమితులయ్యారు. ఎస్. వెంకటేష్‌కు DSP, CID బాధ్యతలు అప్పగించారు. బి. శ్రీనివాస్‌ను DSP, Road Safety, North Zoneగా నియమించగా, జి. మహేందర్ రెడ్డిని DSP, ACBగా పోస్టింగ్ ఇచ్చారు.
అలాగే పి. వెంకటేశ్వర్లును DSP, CIDగా నియమించారు. పి. కరుణాకర్‌కు ACP, Special Branch బాధ్యతలు ఇచ్చారు. ఎం. వెంకట్ రెడ్డిని DSP, Intelligenceగా, జి. గోవర్ధన గిరిని ACP, Special Branchగా నియమించారు. ఎస్. వెంకటేష్‌ను ACP, Crimes, Cyberabadగా పోస్టింగ్ ఇచ్చారు.
ఇక ఆర్. నరేందర్‌ను ACP, CTC, ఖమ్మంగా నియమించగా, బి. శ్రీనివాస్ రావును ACP, Task Force, రామగుండంగా పోస్టింగ్ ఇచ్చారు. కె. పురుషోత్తంను ACP, Special Branch, Cyberabadగా, ఎస్. రాజును ACP, CCS, సిద్ధిపేటగా నియమించారు. ఎం. రాజేష్‌కు DSP, ACB బాధ్యతలు అప్పగించారు.
ఈ బదిలీలతో రాష్ట్ర పోలీసు శాఖలో పలు కీలక విభాగాల్లో అధికారుల బాధ్యతల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.



