బాపూనగర్‌లో ఒక్కసారిగా భారీ శబ్దంతో కూలిన ఇల్లు..
గ్యాస్ సిలిండర్ సురక్షితంగానే ఉండటంతో పేలుడు కారణంపై మిస్టరీ.,
హైదరాబాద్: Saroornagar బాపూనగర్‌లో మంగళవారం మర్మమైన పేలుడు కలకలం రేపింది. రోడ్ నంబర్-4లో ఉన్న ఓ ఇంట్లో భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మొదట ఈ ఘటన గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల జరిగి ఉండొచ్చని స్థానికులు భావించారు. అయితే పరిశీలనలో గ్యాస్ సిలిండర్ సురక్షితంగానే ఉండటం కనిపించింది. దీంతో పేలుడు ఎలా జరిగిందనే విషయంలో సందిగ్ధత నెలకొంది. అసలు కారణం ఏమిటో తనకూ అర్థం కావడం లేదని ఇంటి యజమాని తెలిపారు.
సమాచారం అందుకున్న సరోర్‌నగర్ పోలీసులు, ఇతర అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పేలుడుకు అసలు కారణం ఏమిటో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.
ఫోరెన్సిక్ ఆధారాలపై దృష్టి:
పేలుడు జరిగిన ప్రాంతాన్ని అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఘటనాస్థలం నుంచి లభ్యమైన ఆనవాళ్లను సేకరించి, అవసరమైతే ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ కొనసాగించి, పేలుడుకు దారితీసిన పరిస్థితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
స్థానికుల్లో ఆందోళన:
ఈ ఘటనతో Saroornagar ,బాపూనగర్ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. పేలుడు కారణం త్వరగా వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. దర్యాప్తు పూర్తయ్యాక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.



