పార్లమెంట్‌…. మైండ్ బ్లాక్ ట్విస్టులతో ఎన్‌డీఏ మాస్టర్ ప్లాన్… కౌంటర్ రెడీ అంటున్న విపక్షాలు.

July 7, 2026 12:15 PM
Parliament session as NDA and Opposition prepare for key debates.


Delhi : ఢిల్లీ పాలిటిక్స్ నార్మల్‌గా లేవు. మొన్నటి బడ్జెట్ సెషన్‌లో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను విపక్షాలన్నీ ఏకమై వీగిపోయేలా చేయడంతో దెబ్బతిన్న అధికార ఎన్‌డీఏ కూటమి.. ఈసారి మరింత పదునైన, పక్కా స్మార్ట్ వ్యూహంతో ముందుకు వస్తోంది. త్వరలోనే స్టార్ట్ కాబోతున్న Parliament వర్షాకాల సమావేశాల్లో ఎలాగైనా సరే ఆ కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని మోదీ సర్కార్ ఫుల్ డిటర్మినేషన్‌తో ఉంది.

జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు దాదాపు 19 సిట్టింగుల పాటు సాగబోయే ఈ సెషన్స్ వ్యూహ-ప్రతివ్యూహాలతో హోరాహోరీగా సాగడం ఖాయం. మొన్నటికీ ఇప్పటికీ సీన్ మొత్తం రివర్స్ అయింది. రీసెంట్ పొలిటికల్ డెవలప్‌మెంట్స్ వల్ల అధికార, విపక్షాల స్ట్రెంత్ పూర్తిగా మారిపోయాయి. ఎన్‌డీఏ వైపు నంబర్స్ క్రేజీగా పెరిగాయి. ఖాళీ అయిన 27 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కొట్టేసి ఎన్‌డీఏ తన బలాన్ని పెంచుకుంది. ఇండిపెండెంట్లు, నామినేటెడ్ మెంబర్స్, చిన్న పార్టీల సపోర్ట్‌తో రాజ్యసభలో ఎన్‌డీఏ బలం 150కి చేరబోతోంది. రాజ్యాంగ సవరణ బిల్లుల పాసింగ్‌కు కావాల్సిన 2/3 వంతు మెజారిటీ 160 కి ఇది చాలా క్లోజ్. పైగా బెంగాల్‌లో ఖాళీగా ఉన్న మరో 3 స్థానాలు కూడా బీజేపీ ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.


టీఎంసీ, శివసేన (యూబీటీ) తిరుగుబాటు ఎంపీల ఎంట్రీతో లోక్‌సభలో ఎన్‌డీఏ బలం 318 కి పెరిగే ఛాన్స్ ఉంది. అయితే, ఇక్కడ కూడా 2/3 వంతు మెజారిటీ 360 మార్క్‌ను టచ్ చేయాలంటే బీజేపీకి ఇంకా ఒక 40 సీట్ల సపోర్ట్ అవసరమవుతుంది. మరోవైపు, రీసెంట్ స్టేట్ ఎలక్షన్స్ దెబ్బకు విపక్షాల సంఖ్యాబలమే కాదు, వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ వైబ్స్ కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. రెండు మేజర్ షాక్స్ విపక్షాల ఐక్యతను ఐస్ ముక్కలా కరిగించేశాయి.

రీసెంట్ ఎలక్షన్స్ లో ప్రభంజనం సృష్టించి పవర్ లోకి వచ్చిన దళపతి విజయ్ జోసెఫ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం పార్టీతో కాంగ్రెస్ దోస్తీ కట్టడం మిత్రపక్షం డీఎంకే కి అస్సలు నచ్చలేదు. దాంతో కాంగ్రెస్‌తో డీఎంకే తన మైత్రి బంధానికి చరమగీతం పాడేసింది. ఇక పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి మైండ్ బ్లాక్ షాక్ ఇస్తూ 20 మంది టీఎంసీ ఎంపీలు సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియాకు సపోర్ట్ ఇచ్చారు. ఈ పార్టీ ఆల్రెడీ ఎన్‌డీఏ వైపు ఉంది. అటు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకు గుడ్‌బై చెప్పేసి ఆరుగురు శివసేన (UBT) ఎంపీలు పరోక్షంగా బీజేపీకి జై కొట్టారు.

సంఖ్యాబలం తగ్గినా సరే, పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వంపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించడానికి విపక్షాలు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాయి. వారి చేతిలో కొన్ని హాట్ టాపిక్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా రచ్చ లేపిన నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్, సీబీఎస్‌ఈ 12వ తరగతి డిజిటల్ మూల్యాంకనంలో జరిగిన తప్పులతడకలు. అయోధ్య రామాలయంలో కోట్ల రూపాయల విరాళాలు, స్వర్ణాభరణాల చోరీ ఉదంతం. ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పశ్చిమాసియా వార్ క్రైసిస్ వల్ల భారత్‌లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రేట్లు సెగలు పుట్టించడం. ప్రభుత్వ ఇంటర్నల్ అండ్ ఫారిన్ పాలసీలు ఫెయిల్ అయ్యాయని విపక్షాలు రచ్చ చేయడం ఖాయం.

ఢిల్లీ అఫీషియల్ నివాసంలో కాలిన కరెన్సీ కట్టలు దొరికిన కేసులో.. హైకోర్టు జడ్జ్ జస్టిస్ యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించేందుకు, ఇన్వెస్టిగేషన్ కోసం ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ తన రిపోర్ట్‌ను ఈ సెషన్ లోనే లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ట్విస్ట్ ఏంటంటే.. ఈ విషయంలో అధికార, విపక్షాలు ఆల్రెడీ ఏకతాటిపై ఉన్నాయి. సీరియస్ క్రైమ్స్ లో ఇరుక్కుని, ఏకధాటిగా 30 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండే పీఎం, సీఎంలు, సెంట్రల్ అండ్ స్టేట్ మినిస్టర్లను డైరెక్ట్‌గా పదవుల నుంచి డిస్మిస్ చేసే పవర్‌ఫుల్ బిల్లు 130 వ రాజ్యాంగ సవరణ బిల్లు. ప్రస్తుతం ఇది జేపీసీ పరిశీలనలో ఉంది.

ఈ ఏడాది మార్చి 25న లోక్‌సభలో ప్రవేశపెట్టిన విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు 2026:పై ఈ సెషన్‌లో క్లారిటీ రానుంది. గత ఏడాది డిసెంబర్ నుంచి జేపీసీ స్కానింగ్‌లో ఉన్న వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు సెషన్ లో ముందుకు రానుంది. మార్కెట్ రెగ్యులేషన్స్ కోసం తెచ్చిన సెక్యూరిటీస్ మార్కెట్ బిల్లు, 2025: కూడా జేపీసీ పరిశీలన పూర్తి చేసుకుని సభ ముందుకు రానుంది. ఈ ఏడాది మార్చి 23న ప్రవేశపెట్టిన కార్పొరేట్ చట్టాల (సవరణ) బిల్లు, 2026 పైకూడా ఈ వర్షాకాల సమావేశాల్లో గట్టిగా చర్చ జరగనుంది. సో… రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా ఒక రేంజ్‌లో పొలిటికల్ డ్రామా, మైండ్ గేమ్స్ ఖాయం. లెట్స్ వెయిట్ అండ్ సీ.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media