హైదరాబాద్‌లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి

July 9, 2026 10:44 AM
Three Killed in Separate Road Accidents in Hyderabad

శంషాబాద్‌లో బస్‌స్టాప్‌పైకి దూసుకెళ్లిన బోలెరో
సైదాబాద్‌లో టీజీఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్‌ రైడర్ మృతి

Hyderabad: హైదరాబాద్‌లో వేర్వేరు చోట్ల జరిగిన Road Accidents లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శంషాబాద్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, సైదాబాద్‌లో జరిగిన మరో ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు.

శంషాబాద్‌లో ఇద్దరు మహిళల మృతి

బుధవారం రాత్రి శంషాబాద్‌లోని సత్తంరాయి గ్రామంలో వేగంగా వచ్చిన బోలెరో వాహనం అదుపుతప్పి బస్‌స్టాప్‌పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్‌స్టాప్ వద్ద నిలబడి ఉన్న ఇద్దరు మహిళలను వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సైదాబాద్‌లో బైక్‌ను ఢీకొట్టిన టీజీఎస్‌ఆర్టీసీ బస్సు

గురువారం నగరంలోని సైదాబాద్‌లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని టీజీఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడి గుర్తింపు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media