అమెరికా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయనున్న ట్రంప్ ప్రభుత్వం
హెచ్-1బీ, గ్రీన్ కార్డ్, OPT, EAD విధానాల్లో కీలక మార్పులకు ప్రతిపాదనలు
యూఎస్ వెళ్లాలనే ఇండియన్స్ కలలపై డొనాల్డ్ Trump గవర్నమెంట్ గట్టి దెబ్బే కొట్టబోతోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ స్లోగన్‌తో సెకండ్ టైమ్ పవర్‌లోకి వచ్చిన ట్రంప్… అక్రమ వలసదారుల ఏరివేతతో పాటు విదేశీ ఉద్యోగులు, విద్యార్థులపై కూడా ఫోకస్ పెట్టారు. వచ్చే నెల నుంచే వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ కొత్త ప్రపోజల్స్ తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికి ఇవి ప్రతిపాదనలే అయినప్పటికీ, ఇవి అమల్లోకి వస్తే మాత్రం అమెరికన్ వీసా దక్కించుకోవడం నెక్స్ట్ లెవెల్ టాస్క్ కానుంది. విపరీతమైన డాక్యుమెంటేషన్, స్క్రూటినీతో పాటు ఖర్చులు కూడా భారీగా పెరగబోతున్నాయి.
కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీలో రాబోతున్న మెయిన్ చేంజెస్
హెచ్-1బీ వీసాలకు భారీ ఫీజులు.. కఠిన నిబంధనలు
ఇకపై ఐటీ ఉద్యోగులకు ఇచ్చే హెచ్-1బీ వీసా ఫీజులు భారీగా పెరగనున్నాయి. కేవలం ఫీజులే కాదు.. ఉద్యోగి హిస్టరీ, కంపెనీ ప్రొఫైల్‌ను హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ మైక్రోస్కోప్‌తో వెతికినట్టు వెతకనుంది. క్లయింట్ సైట్లలో ఎంప్లాయ్స్ ఏం వర్క్ చేస్తున్నారో డిటెయిల్డ్‌గా చెప్పాల్సి ఉంటుంది. రూల్స్ బ్రేక్ చేసే కంపెనీలపై కఠిన చర్యలు ఉంటాయి. అలాగే యూనివర్సిటీలు, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌కు ఉండే యాన్యువల్ కోటా మినహాయింపులకు కూడా కోత పడనుంది.
గ్రీన్ కార్డ్ ప్రాసెస్ మరింత కాస్ట్లీ
అమెరికాలో పర్మనెంట్ సెటిల్‌మెంట్‌కు దారి తీసే గ్రీన్ కార్డ్ (PERM లేబర్ సర్టిఫికేట్) ఫీజులను కూడా పెంచాలని కార్మిక శాఖ భావిస్తోంది. కంపెనీలు తమ వద్ద పనిచేసే హెచ్-1బీ హోల్డర్లకు కనీస వేతనాలు పెంచాల్సి ఉంటుంది. అమెరికన్ల కంటే ఎక్కువ శాలరీ ఇస్తున్నామని కంపెనీ ప్రూవ్ చేసుకుంటేనే ఈ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ఖర్చులను పెంచడం ద్వారా గ్రీన్ కార్డుల జారీని తగ్గించడమే ట్రంప్ సర్కార్ ప్లాన్.
స్టూడెంట్స్ ఓపీటీ కాలపరిమితిపై ఆంక్షలు
అమెరికాలో చదువుకునే స్టూడెంట్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం ఉండే OPT ప్రోగ్రామ్‌లో పెద్ద మార్పులు రాబోతున్నాయి. కోర్సు అయిపోయాక ఎంత కాలమైనా ఉండే ఛాన్స్ ఇకపై ఉండదు. ఒక ఫిక్స్‌డ్ టైమ్ మాత్రమే పర్మిషన్ ఇస్తారు. ఆ తర్వాత ఎక్స్‌టెన్షన్ కోసం మళ్లీ అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు ఇచ్చే రెండేళ్ల ఎక్స్‌టెన్షన్ రూల్స్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రివ్యూ చేయనున్నారు.
ఈఏడీ ఆటోమేటిక్ పొడిగింపునకు బ్రేక్
విదేశీయులు యూఎస్‌లో లీగల్‌గా జాబ్ చేసుకునేందుకు ఇచ్చే ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ (EAD) ఫైనల్ రూల్స్ ఈ నెలలోనే రానున్నాయి. దీనివల్ల EAD ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్‌కు బ్రేక్ పడుతుంది. సాధారణంగా హెచ్-1బీ వీసాదారుల భార్య/భర్తలే ఈ రూల్ ద్వారా జాబ్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఎక్స్‌టెన్షన్ ప్రాసెస్ లేట్ అయితే, వాళ్లు తాత్కాలికంగా ఉద్యోగాలు కోల్పోయే డేంజర్ ఉంది.
ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు డీహెచ్‌ఎస్, కార్మిక, విదేశీ వ్యవహారాల శాఖల ఉమ్మడి అజెండాలో ఉన్నాయి. టెక్ కంపెనీలు, యూనివర్సిటీల నుంచి పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత, ఫెడరల్ రిజిస్టర్‌లో పబ్లిష్ చేసి వచ్చే నెల నుంచే వీటిని అమల్లోకి తెచ్చేందుకు ట్రంప్ టీమ్ యుద్ధప్రాతిపదికన వర్క్ చేస్తోంది.



