14 జట్లతో టోర్నీ.. 2003 తరహా సూపర్-6 విధానం తిరిగి ఎంట్రీ
లీగ్ దశలో ప్రతి మ్యాచ్ కీలకం.. పాయింట్లే సెమీఫైనల్ రేస్‌ను నిర్ణయిస్తాయి
క్రికెట్ ప్రపంచంలో నెక్స్ట్ బిగ్గెస్ట్ రోలర్ కోస్టర్ రైడ్‌కు టైమ్ ఫిక్స్ అయింది. ICC 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తుంటే, ఐసీసీ మాత్రం ఈసారి టోర్నీని కంప్లీట్ గా రీబూట్ చేసేసింది. 2019, 2023లో కేవలం 10 జట్లతో బోర్ కొట్టించిన ఐసీసీ, ఈసారి రూట్ మార్చి ఏకంగా 14 జట్లతో మెయిన్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. అయితే ఇంటర్నెట్‌లో తిరుగుతున్న సూపర్-7, సూపర్ సిరీస్ లాంటి రూమర్స్ అన్నీ పక్కన పెడితే… ఐసీసీ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన అసలు సిసలైన ఫార్మాట్ ఏంటంటే, ఇది ప్యూర్ 2003 నాటి నోస్టాల్జియా వైబ్స్ ఇచ్చే సూపర్ 6 మోడల్ మోడల్.
షెడ్యూల్ ప్రకారం ఈ క్రేజీ టోర్నీకి సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా హోస్టింగ్ ఇస్తున్నాయి. టోర్నీ స్టార్ట్ అవ్వడమే 14 జట్లను గ్రూప్-A, గ్రూప్-B గా చేసి, ఒక్కో గ్రూప్‌లో ఏడేసి జట్లు ఉన్నాయి. ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది, లీగ్ స్టేజ్‌లో ప్రతి టీమ్ తమ గ్రూప్‌లోని మిగతా ఆరు టీమ్స్‌తో తలపడాలి. గ్రూప్ మ్యాచ్‌లు ముగిసేసరికి ఏ గ్రూప్ నుండి అయితే టాప్-3 స్థానాల్లో నిలుస్తాయో, ఆ ఆరు జట్లు మాత్రమే నెక్స్ట్ లెవెల్ సూపర్-6 స్టేజ్‌లోకి అడుగుపెడతాయి. మిగిలిన 8 జట్లు లగేజ్ సర్దుకుని ఇంటికి పోవాల్సిందే.
ట్విస్ట్ ఇక్కడే ఉంది…. ఈ సూపర్-6 రౌండ్‌లో ఒక టీమ్ తన గ్రూప్ నుండి వచ్చిన మిగతా రెండు జట్లతో మళ్ళీ మ్యాచ్‌లు ఆడక్కర్లేదు. కేవలం ఆపోజిట్ గ్రూప్ నుండి క్వాలిఫై అయి వచ్చిన ముగ్గురితో మాత్రమే ఫైట్ చేయాలి. ఐతే, లీగ్ స్టేజ్‌లో తమ సొంత గ్రూప్‌లోని క్వాలిఫైడ్ టీమ్స్‌పై సాధించిన పాయింట్లు ఈ సూపర్-6 టేబుల్‌కు యాడ్ అవుతాయి. అంటే లీగ్ స్టేజ్ లో ఒక్క మ్యాచ్ లైట్ తీసుకున్నా సూపర్-6 లో సీన్ సితార అయిపోతుందన్నమాట. ఈ పాయింట్ల లొల్లి అంతా అయ్యాక సూపర్-6 టేబుల్‌లో నిలిచే టాప్-4 జట్లు డైరెక్ట్‌గా సెమీఫైనల్స్ నాకౌట్స్‌కు వెళ్తాయి, ఆపై అల్టిమేట్ గ్రాండ్ ఫైనల్ రేస్ ఉంటుంది.
ఈ ఫార్మాట్ వెనుక ఐసీసీ మైండ్ గేమ్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. చిన్న జట్లయిన అసోసియేట్ నేషన్స్‌కు ఇదొక గోల్డెన్ అపార్చునిటీ. కానీ ఇండియా, ఆస్ట్రేలియా లాంటి బిగ్ షాట్స్‌కు మాత్రం ఇది హై-రిస్క్ జోన్. 2007 వరల్డ్ కప్‌లో ఇండియా, పాకిస్తాన్ ఫస్ట్ రౌండ్‌లోనే ఘోరంగా ఎగ్జిట్ అవ్వడంతో ఐసీసీకి వ్యూయర్ షిప్, రెవెన్యూ పరంగా ఊహించని నష్టాలు వచ్చాయి. అందుకే ఆ తర్వాత 10 జట్ల సేఫ్ గేమ్ ఆడారు. కానీ ఇప్పుడు మళ్ళీ పాత 2003 ఫార్మాట్‌ను నమ్ముకుని 14 జట్లతో వస్తుండటం అనేది ఐసీసీ ఆడుతున్న బిగ్గెస్ట్ గ్యాంబ్లింగ్. ఈ సారి ఏ జట్లు హిస్టరీ క్రియేట్ చేస్తాయో, ఏ జట్లు చాప చుట్టేస్తాయో చూడాలి మరి.



