రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడిపై భారీ అంచనాలు
అనుమతుల ప్రక్రియ, నీటి వినియోగం, పర్యావరణ ప్రభావంపై ప్రశ్నలు
విశాఖపట్నం వేదికగా రూ. 1.3 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో Google ,Adani, Airtel కలిసి ఒక క్రేజీ ఏఐ డేటా సెంటర్ హబ్‌ను రెడీ చేస్తున్నాయి. వినడానికి ఇది పీక్ మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీలా ఉన్నా, దీని వెనుక జరిగిన పర్మిషన్స్ కథ చూస్తే మాత్రం పక్కా స్కామ్ అనే ఫీల్ వస్తోంది. మ్యాటర్ ఏంటంటే, పర్యావరణ శాఖను గూగుల్ క్రోమ్ రేంజ్ స్పీడ్‌తో బైపాస్ చేయడానికి వీళ్లు వాడిన హాక్ చూస్తే షాక్ ఖాయం. రూల్స్ ప్రకారం ఒక భారీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్‌కు సెంట్రల్ గవర్నమెంట్ నుండి పర్మిషన్లు తేవడం చాలా తలనొప్పి. అందుకే ఒక అల్టిమేట్ లూప్‌హోల్‌ను ఐడెంటిఫై చేశారు. పర్యావరణ చట్టాల్లో 1.5 లక్షల చదరపు మీటర్ల కంటే తక్కువ కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటే, దాన్ని జస్ట్ ఒక బిల్డింగ్ ప్రాజెక్ట్‌లా అంటే బీ2 కేటగిరీలా చూపిస్తూ స్టేట్ లెవెల్లోనే పర్మిషన్లు ఇచ్చేయొచ్చు. ఇక్కడే మనోళ్లు అండర్స్టుడ్ ద అసైన్మెంట్ అన్నట్టు… 601 ఎకరాల సింగిల్ ప్రాజెక్ట్‌ను ఒకేసారి చూపించకుండా తర్లువాడ, రాంబిల్లి, అడవివరం అని మూడు పార్ట్ లుగా డివైడ్ చేశారు. ప్రతి యూనిట్ బిల్ట్-అప్ ఏరియాను 1.5 లక్షల లిమిట్ కంటే జస్ట్ కొంచెం తక్కువగా ఉండేలా ప్లాన్ చేశారు. ఇదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారుతోంది.
AI డేటా సెంటర్లకు భారీ విద్యుత్ అవసరం
జనరల్ గా పబ్లిక్ గూగుల్ డేటా సెంటర్ అంటే కేవలం కంప్యూటర్లు, పెద్ద సర్వర్లు ఉండే ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే, ఇవి ప్యూర్ పవర్ అండ్ వాటర్ హంగ్రీ గిగ్స్. ఈ క్లౌడ్ అండ్ ఏఐ సర్వర్లు కంటిన్యూగా రన్ అవ్వడానికి వందల మెగావాట్ల విద్యుత్ కావాలి. దీనికోసమే ఇక్కడ అదానీ గ్రూప్ పిక్చర్లోకి వచ్చింది. గూగుల్ సర్వర్ల కోసం అదానీ గ్రీన్ ఎనర్జీ నుండి పవర్ సప్లై చేయడానికి ప్లాన్ నడుస్తోంది. సర్వర్లు వేడెక్కకుండా కూల్ చేయడానికి రోజుకు లక్షల లీటర్ల నీరు కావాలి. విశాఖ లాంటి కోస్టల్ సిటీలో ఆల్రెడీ సమ్మర్లో వాటర్ క్రైసిస్ ఉంటుంది. అలాంటిది ఈ ప్రాజెక్ట్‌కు అంత నీరు ఎక్కడి నుండి ఇస్తారు? పర్యావరణవేత్తల మెయిన్ భయం ఇదే, కానీ దీన్ని ఎక్కడా పబ్లిక్ డాక్యుమెంట్లలో హైలైట్ చేయట్లేదు.
కంబాలకొండ సమీపంలో ప్రాజెక్ట్.. పర్యావరణ ప్రభావంపై చర్చ
వైజాగ్ చుట్టుపక్కల ఉన్న మూడు లొకేషన్లు తర్లువాడ, అడవివరం, రాంబిల్లిలను సెలెక్ట్ చేయడం వెనుక చాలా కాలిక్యులేటెడ్ ప్లాన్ ఉంది. అడవివరం, తర్లువాడ ప్రాంతాలు కంబాలకొండ వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, అటవీ ప్రాంతాలకు అత్యంత దగ్గరగా ఉంటాయి. నిజానికి ఇక్కడ భారీ పరిశ్రమలు పెడితే పర్యావరణం కంప్లీట్ గా డ్యామేజ్ అవుతుంది.
కానీ ఇక్కడ ఐటీ, ఏఐ హబ్స్ పెడితే సిటీకి కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. అందుకే ఈ ఫారెస్ట్ బౌండరీ రూల్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికే ఈ మూడు లొకేషన్లను విడివిడి వేర్ హౌసింగ్ ప్రాజెక్టులుగా పేపర్స్ మీద డిజైన్ చేశారు. ఇది పక్కా లీగల్ లూప్‌హోల్స్ వాడి సిస్టమ్‌ను వాడేయడమే.
ఏ గవర్నమెంట్ ఫైల్ అయినా టేబుల్స్ మారడానికి నెలలు పడుతుంది. అలాంటిది 9 రోజుల్లో అన్ని క్లియరెన్సులు వచ్చేసాయంటే, బ్యాక్‌గ్రౌండ్‌లో టాప్-లెవెల్ పొలిటికల్ పుష్ గట్టిగా ఉందని అర్థం. గ్లోబల్ ఇన్వెస్టర్స్ అయిన గూగుల్‌కు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద త్వరగా పనులు చేసి చూపించకపోతే ప్రాజెక్ట్ వేరే స్టేట్‌కు వెళ్లిపోయే రిస్క్ ఉంటుంది. అందుకే బ్యూరోక్రసీ మొత్తం రూల్ బుక్‌ను పక్కన పెట్టేసి, రెడ్ టేపిజం లేకుండా సూపర్ ఫాస్ట్ మోడ్‌లో సంతకాలు పెట్టేసింది. అయితే ఈ తొందరపాటు ఫ్యూచర్లో కోర్టు కేసుల రూపంలో ప్రాజెక్ట్‌కు స్పీడ్ బ్రేకర్ అయ్యే ప్రమాదం ఉంది.
అభివృద్ధి–పర్యావరణ సమతుల్యతపై కొనసాగుతున్న చర్చ
గ్రీన్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ అంటూ గ్లోబల్ లెవెల్లో గూగుల్ పెద్ద పెద్ద స్పీచ్‌లు ఇస్తుంది. అలాంటిది ఒక అడవి పక్కన కడుతున్న ప్రాజెక్ట్‌కు ఇలాంటి అనుమతుల వివాదం వస్తే వారి గ్లోబల్ ఇమేజ్ దెబ్బతింటుంది. అందుకే ఈ ఇష్యూపై అటు గూగుల్ ప్రతినిధులు కానీ, ఇటు అదానీ టీమ్ కానీ ఎక్కడా ప్రెస్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా కంప్లీట్ గా ఘోస్ట్ మోడ్ మెయింటైన్ చేస్తున్నారు. మ్యాటర్ వీలైనంత సైలెంట్‌గా క్లోజ్ అవ్వాలన్నదే వారి ప్లాన్.ఈ ప్రాజెక్ట్ వల్ల ఏపీకి టెక్నాలజీ పరంగా పీక్ లెవెల్ బూస్ట్ వస్తుందనేది ఎంత నిజమో… దాన్ని తెస్తున్న పద్ధతిలో పర్యావరణాన్ని కంప్లీట్ గా టాక్సిక్ చేస్తున్నారనేది అంతే నిజం. డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ మధ్య జరుగుతున్న ఈ మైండ్ గేమ్‌లో చివరికి గెలిచేది ఎవరో చూడాలి.



