శేరిలింగంపల్లి ఓటర్ జాబితా సవరణపై బీజేపీ సమీక్ష సమావేశం.. జూలై 31లోగా ఎన్యూమరేషన్ ఫార్మ్స్ పూర్తి చేయాలని పిలుపు

July 22, 2026 4:10 PM
BJP leaders addressing Sherilingampally SIR review meeting in Miyapur.

మియాపూర్‌లో నిర్వహించిన SIR సమీక్ష సమావేశంలో కీలక సూచనలు

బీజేపీ బీఎల్‌ఏలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని మర్రి శశిధర్ రెడ్డి, రవికుమార్ యాదవ్ సూచన

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో SIR సమీక్ష సమావేశం

శేరిలింగంపల్లి నియోజకవర్గ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంపై బీజేపీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మియాపూర్‌లోని భూమి బ్యాంక్వెట్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర SIR కన్వీనర్ మర్రి శశిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సమావేశంలో జోన్-3 ఇంచార్జి ఇంద్రసేన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజిత్, రాష్ట్ర ప్రొఫెషనల్ సెల్ కన్వీనర్ బాల్దా అశోక్, మహిళా మోర్చా కార్యదర్శి పద్మ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేశవరావు, జిల్లా ఇంచార్జి ఆలే భాస్కర్, బీఎల్‌ఏ-1 మాణిక్ రావు పాల్గొన్నారు.

బీఎల్‌ఏల పనితీరును ప్రశంసించిన నాయకులు

ఈ సందర్భంగా మాట్లాడిన మర్రి శశిధర్ రెడ్డి, రవికుమార్ యాదవ్ బీఎల్‌వోలతో సమన్వయం చేస్తూ బీజేపీ బీఎల్‌ఏలు సమర్థంగా పనిచేస్తున్నారని అభినందించారు. ఓటర్ జాబితా సవరణలో బీఎల్‌ఏల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

జూలై 31లోగా బీజేపీ సానుభూతి ఓటర్లందరితో ఎన్యూమరేషన్ ఫార్మ్స్ పూర్తి చేయించి సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. ప్రతి బూత్‌లో పెండింగ్‌లో ఉన్న ఫార్మ్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.

44 శాతం ఎన్యూమరేషన్ పూర్తి

నాయకులు వెల్లడించిన వివరాల ప్రకారం కొండాపూర్‌లో 43.15 శాతం, లింగంపల్లిలో 43.38 శాతం, భారతి నగర్‌లో 45.12 శాతం, గచ్చిబౌలిలో 44.61 శాతం,

మాదాపూర్‌లో 43.64 శాతం, చందానగర్‌లో 45.79 శాతం, మియాపూర్‌లో 41.95 శాతం, హఫీజ్‌పేట్‌లో 42.35 శాతం, హైదర్‌నగర్‌లో 44.01 శాతం, ఆల్విన్ కాలనీలో 43.53 శాతం,

వివేకానంద నగర్‌లో 45.48 శాతం, పాపిరెడ్డి నగర్‌లో 43.07 శాతం ఎన్యూమరేషన్ పూర్తైంది.

మొత్తంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు 44 శాతం మేరకు 3,37,887 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అధికారులకు అందించినట్లు తెలిపారు. ఈ పురోగతిలో బీజేపీ బీఎల్‌ఏల కృషి ముఖ్యమని పేర్కొన్నారు.

ఫామ్-8 వినియోగంపై ప్రత్యేక సూచనలు

ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు బూత్‌లలో ఓటర్లుగా ఉంటే ఆగస్టు 3 తర్వాత ఫామ్-8 ద్వారా ఒకే బూత్‌కు మార్చే ప్రక్రియ చేపట్టాలని సూచించారు.

డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదలైన తర్వాత 18 సంవత్సరాలు పూర్తి చేసిన కొత్త ఓటర్లను నమోదు చేయాలని చెప్పారు.

అలాగే శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలో నివసిస్తున్న బీజేపీ సానుభూతి ఓటర్లను ఫామ్-8 ద్వారా సంబంధిత బూత్‌లకు ఓట్లు మార్చుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రతి రోజు పురోగతిని పరిశీలించాలి

ప్రతి రోజు బీఎల్‌ఏలు తమ పరిధిలోని బీఎల్‌వోల నుంచి ఎన్ని ఫార్మ్స్ తిరిగి వచ్చాయి, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలను సేకరించాలని నాయకులు సూచించారు.

ఆ వివరాలను పార్టీ నాయకత్వానికి అందించాలని తెలిపారు.

రాష్ట్ర, జిల్లా నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, భవిష్యత్తులో పోటీ చేయాలనుకునే నాయకులు తమ డివిజన్లలో బీఎల్‌ఏలకు అందుబాటులో ఉండి అవసరమైన సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

బీఎల్‌ఏలు లేని బూత్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని సూచించారు.

పాల్గొన్న నాయకులు

ఈ సమావేశంలో మహిపాల్ రెడ్డి, అశోక్ కురుమ, అజిత్, కేశవరావు, మాణిక్ రావు, అనిల్ గౌడ్, భాస్కర్ రెడ్డి, పద్మ, వసంత్ యాదవ్, రామరాజు, సీతారామరాజు, విజయేందర్ తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media