మోదీ జెన్ జీ మోడ్… భాయియో ఔర్ బహెనోకి బై-బై… ఇకపై అంతా హాయ్ మై ఫ్రెండ్స్.

July 25, 2026 12:48 PM
Modi's Gen Z Style Creates Buzz on Social Media

జెన్ జీ స్టైల్‌లో మోదీ కొత్త డిజిటల్ ఎంట్రీ

INDIA: ఇండియన్ పాలిటిక్స్ అనగానే …భాయియో ఔర్ బహెనో, సవా కరోడ్ దేశ్‌వాసియో… అని మైక్ ముందుకు వచ్చి ఇచ్చే మాస్ స్పీచ్‌ లు కామన్. కానీ, దేశప్రధాని నరేంద్ర మోదీ మాత్రం నేను ట్రెండ్‌ని ఫాలో అవ్వను… ట్రెండ్ సెట్ చేస్తాను అని ప్రూవ్ చేశారు. కాలంతో పాటు మారడం కాదు, కాలాన్నే తన అకౌంట్‌లో వేసేసుకోవడం Modi’s స్టైల్. రీసెంట్‌గా ఆయన సోషల్ మీడియాలో వేస్తున్న స్కెచ్‌లు, సెల్ఫీ వీడియోలు చూస్తుంటే… మోదీ కూడా జెన్ జీ (Gen Z) మోడ్‌లోకి వచ్చేశారా? అని యూత్ అంతా షాకింగ్ విత్ షేకింగ్ అవుతున్నారు.

మొన్నటికి మొన్న నీట్ (NEET) పేపర్ లీకేజ్ మేటర్ డెడ్ సీరియస్ అయ్యాక, విపక్షాలు సీన్ లోకి వచ్చేశాయి. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ డ్రామాలు, రోడ్లపై పిల్లల ప్రొటెస్ట్‌లతో రచ్చ రచ్చ అయింది. రాహుల్ గాంధీ కూడా తన పగిలిన షూస్, చిరిగిన బట్టలు చూపిస్తూ ఇన్‌స్టాలో ఎమోషనల్ మైలేజ్ కోసం ట్రై చేశారు. కాంగ్రెస్ బ్యాచ్ అంతా ఇందిరమ్మ రేంజ్ త్యాగాల బిల్డప్ ఇచ్చి బాగానే ప్రెజర్ క్రియేట్ చేశారు.

యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నంగా వైరల్ వీడియోలు:

కానీ మోదీ ఊరుకుంటారా? యూత్ అసలే ఫుల్ ఫైర్‌లో ఉన్నారని గ్రహించి, లేట్ చేయకుండా మిడ్‌నైట్ పార్లమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక నెక్స్ట్ లెవెల్ సెల్ఫీ వీడియో వదిలారు. లీకేజ్ చేసినోళ్లెవ్వడూ ఎస్కేప్ అవ్వలేడు, సీన్ రివర్స్ అవుద్ది…. అని స్ట్రెయిట్ ఇన్‌స్టా స్టోరీ టైప్ విజువల్‌తో క్లారిటీ ఇచ్చేసరికి, ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ మైండ్ గేమ్‌తో గాలి మొత్తం తీసేశారు.

అసలు ట్విస్ట్ ఏంటంటే… ఆ తర్వాత వచ్చిన సెకండ్ వీడియోలో ఆయన వేసిన స్టెప్. రోజూ వాడే ఆ పాత ఫార్మాలిటీస్, భాయియో బహెనో లాంటి హెవీ వర్డ్స్‌కి బై-బై చెప్పేసి, పక్కా నయా జెన్ జీ వైబ్‌తో… హాయ్ మై ఫ్రెండ్స్.. అని సింపుల్‌గా ఎంటర్ అయ్యారు.

రాజకీయాల్లో సోషల్ మీడియా గేమ్‌చేంజర్‌గా మారిన కొత్త ట్రెండ్

థాంక్యూ ఫ్రెండ్స్… నిన్న నైట్ మీతో మాట్లాడటం భలే అనిపించింది. నా వీడియోకి మీరు ఇచ్చిన లవ్, వాల్యూబుల్ సజెషన్స్‌కి హ్యాపీ… మీ నమ్మకమే నా రియల్ పవర్ అని చెప్పారు. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ కెమెరా యాంగిల్స్ చూస్తుంటే, పక్కా ఒక డ్యూడ్‌తో డిస్కస్ చేస్తున్నట్టే ఉండింది. అయితే ఇది కేవలం ఒక వీడియో గిమిక్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మాస్టర్ ప్లాన్ అక్కడే ఆగలేదు.

డెలివరీ నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలని కేబినెట్ మినిస్టర్స్‌కి కూడా గట్టిగా ఆర్డర్స్ ఇచ్చేశారు. అందరూ ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండండి, కుర్రాళ్లతో కనెక్ట్ అవ్వండి, వైబ్స్ కలవాలి… అని క్లియర్ కాట్ మ్యాండేట్ ఇచ్చేశారు. ఇంకోపక్క పర్యావరణ వేత్త సోనం వాంగ్‌చుక్‌తో మినిస్టర్లు కూర్చుని మ్యాటర్ సాల్వ్ చేయించి, ఆయనతోనే అఫీషియల్ స్టేట్‌మెంట్స్ ఇప్పించి మేటర్ కూల్ చేశారు.

మొత్తానికి ఏజ్ కేవలం ఒక నంబర్ మాత్రమే అని ప్రూవ్ చేస్తూ… టెక్నాలజీ, మైండ్ సెట్, మైక్రో-ట్రెండ్స్ ఏదైనా సరే…. జెన్ జీ మైండ్‌సెట్‌ని పర్ఫెక్ట్‌గా డికోడ్ చేసి, వాళ్ల లాంగ్వేజ్‌లోనే కౌంటర్ ఇచ్చిన మోదీ లీడర్‌షిప్ స్టైల్ మాత్రం “అన్ స్టాపబుల్.. వేరే లెవెల్ అంతే”


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media