విధి నిర్వహణలోనే కుప్పకూలిన SPO  SPO constable.. చికిత్స పొందుతూ మృతి

July 28, 2026 11:55 AM
Special Police Officer Nagarjuna Reddy died on duty

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో డ్యూటీలో ఉండగా గుండెపోటు వచ్చినట్లు అనుమానం
రిటైర్డ్ Army సిబ్బంది అయిన నాగార్జున రెడ్డి.. తర్వాత SPOగా పోలీస్ శాఖలో సేవలు

హైదరాబాద్‌: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న Special Police Officer (SPO) నాగార్జున రెడ్డి (60) సోమవారం గుండెపోటుతో మృతి చెందిన ఘటన విషాదాన్ని కలిగించింది.

మల్కాజ్‌గిరికి చెందిన నాగార్జున రెడ్డి, Indian Armyలో సేవలు పూర్తి చేసి రిటైర్ అయిన తర్వాత పోలీస్ శాఖలో SPOగా చేరి విధులు నిర్వహిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో డ్యూటీలో ఉండగా నాగార్జున రెడ్డికి ఒక్కసారిగా అస్వస్థత కలిగింది. ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలారు.

తోటి పోలీస్ సిబ్బంది వెంటనే ఆయనను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సమీప ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

నాగార్జున రెడ్డి మృతితో పోలీస్ శాఖలో విషాదం నెలకొంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media