కావేరీ జల వివాదంపై రైతుల ఆందోళనలో వివాదాస్పద వ్యాఖ్యలు
నటి త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు
చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష నేత Udhayanidhi Stalin ను పోలీసులు మంగళవారం ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు. కావేరీ జల వివాదంపై తంజావూరులో జరిగిన సమావేశంలో ఆయన చేసిన వివాదాస్పద డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై ప్రశ్నించేందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఆగస్టు 3న రైతుల నిరసనలో వ్యాఖ్యలు
కావేరీ నీటి వివాదంపై ఆగస్టు 3న డీఎంకే నిర్వహించిన రైతుల నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
సభలో కొంతమంది నటి త్రిష పేరును నినదించిన సమయంలో.. ఉదయనిధి ఆమెను ఉద్దేశిస్తూ అభ్యంతరకరమైన డబుల్ మీనింగ్ వ్యాఖ్య చేశారనే ఆరోపణలు వచ్చాయి.
జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు అధికారంలో ఉన్న TVK పార్టీ కూడా చర్యలకు ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి C Joseph Vijay నేతృత్వంలోని TVK పార్టీ ఉదయనిధి స్టాలిన్ ప్రసంగంపై జాతీయ మహిళా కమిషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసింది.



