BP మందు Hydrochlorothiazide కూడా Group 1 కార్సినోజెన్గా వర్గీకరణ
మందులు వాడుతున్నవారు డాక్టర్ సలహా లేకుండా ఆపొద్దని WHO సూచన
హైదరాబాద్: సాధారణంగా ఉపయోగించే మూడు మందుల్లోని యాక్టివ్ డ్రగ్ ఇంగ్రిడియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) **Group 1 ‘క్యాన్సర్కు కారణమయ్యే పదార్థాలు’**గా వర్గీకరించింది.
వీటిలో భారత్లో అధిక రక్తపోటు నియంత్రణకు విస్తృతంగా ఉపయోగించే Hydrochlorothiazide (HCTZ) కూడా ఉంది. మిగతా రెండు మందులు Voriconazole, Tacrolimus.
Group 1 అంటే ఏమిటి?
Group 1 కార్సినోజెన్గా వర్గీకరించడం అంటే.. ఈ రసాయన సమ్మేళనాలు మనుషుల్లో క్యాన్సర్కు కారణమయ్యే అవకాశం ఉందని నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని అర్థం.
WHO తెలిపిన వివరాల ప్రకారం.. IARC Monographs Volume 137లో ఈ పరిశోధన ఫలితాలను ప్రచురించారు.
అంతర్జాతీయ నిపుణుల బృందం ఎపిడెమియాలజీ అధ్యయనాలు, జంతువులపై పరిశోధనలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఈ వర్గీకరణ చేసింది.
మూడు మందులపై WHO ఏమి చెప్పింది?
Hydrochlorothiazide (HCTZ):
HCTZ అనేది అధిక రక్తపోటు, శరీరంలో వాపు వంటి సమస్యలకు ఉపయోగించే థయజైడ్ డయూరెటిక్. గతంలో దీనిని Group 2B అంటే ‘క్యాన్సర్కు కారణమయ్యే అవకాశం ఉన్నది’గా వర్గీకరించారు.
అయితే ఎక్కువ కాలం HCTZ వాడటానికి Non-Melanoma Skin Cancers, ముఖ్యంగా Squamous Cell Carcinoma (SCC), అలాగే పెదవుల క్యాన్సర్కు మధ్య సంబంధాన్ని చూపించే బలమైన ఆధారాలు లభించడంతో Group 1గా మార్చారు.
సూర్యకాంతిలోని UV కిరణాలకు HCTZ గురైనప్పుడు చర్మంలో కణాలకు నష్టం కలిగించే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడుతుందని WHO వివరించింది.
Voriconazole:
ఇది తీవ్రమైన శరీరవ్యాప్త ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ఉపయోగించే broad-spectrum triazole antifungal మందు. ముఖ్యంగా అవయవ మార్పిడి తర్వాత చికిత్సలో, ICUల్లో దీనిని ఉపయోగిస్తారు.
Voriconazole శరీరంలో N-oxide అనే ప్రధాన మెటాబొలైట్గా మారుతుంది. ఇది సూర్యకాంతి ప్రభావంతో చర్మ కణాలకు నష్టం కలిగించే phototoxicityని చూపుతుందని WHO తెలిపింది.
Tacrolimus:
అవయవ మార్పిడి చేసిన రోగుల్లో అవయవం తిరస్కరణకు గురికాకుండా ఉండేందుకు Tacrolimusను సాధారణంగా నోటి ద్వారా లేదా ఇంట్రావీనస్గా ఇస్తారు. కొన్ని చర్మ సమస్యలు, ఉదాహరణకు eczema, vitiligo కోసం topical రూపంలోనూ ఉపయోగిస్తారు.
శరీరమంతా పనిచేసే Tacrolimus రోగనిరోధక వ్యవస్థను అణిచివేస్తుంది. దీంతో అసాధారణ కణాల పెరుగుదలను నియంత్రించే శరీర సామర్థ్యం తగ్గి, దీర్ఘకాలంలో Non-Hodgkin Lymphoma, చర్మ క్యాన్సర్ల ముప్పు పెరగవచ్చని WHO పేర్కొంది.
BP మందులు వాడుతున్నవారు ఏం చేయాలి?
మూడు మందులను కార్సినోజెన్లుగా వర్గీకరించినప్పటికీ.. రోగులు డాక్టర్ సలహా లేకుండా తమ మందులను అకస్మాత్తుగా ఆపకూడదని WHO సూచించింది.
ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవారు తమ general physician లేదా hypertension specialistను సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.
హైదరాబాద్ వైద్యుల ప్రకారం.. ప్రస్తుతం HCTZను ఒంటరిగా ఇవ్వడం చాలా తక్కువగా జరుగుతోంది. తక్కువ ధరలో లభించే fixed-dose single-pill combinationsలో Telmisartan, Losartan, Olmesartan వంటి Angiotensin Receptor Blockers (ARBs)తో కలిపి HCTZను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
తెలంగాణలో దాదాపు 27 లక్షల మంది hypertension రోగులు ఉన్న నేపథ్యంలో ఈ వర్గీకరణకు ప్రాధాన్యం ఏర్పడింది.
అయితే నియంత్రణలో లేని అధిక రక్తపోటు వల్ల వచ్చే ప్రాణాంతక స్ట్రోక్, గుండెపోటు, కిడ్నీ వైఫల్యం వంటి తక్షణ ప్రమాదాలు..
HCTZతో సంబంధం ఉన్న చర్మ క్యాన్సర్ దీర్ఘకాలిక గణాంకపరమైన ప్రమాదం కంటే ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య అధికారులు, కార్డియాలజిస్టులు స్పష్టం చేశారు.



