డిజిటల్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై ప్రత్యేక దృష్టి.. మహిళలపై నేరాల్లో జీరో టాలరెన్స్
ప్రతి నెల పోలీస్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్.. రోడ్డు భద్రతపై ప్రత్యేక ఆడిట్లు
అమరావతి: మారుతున్న నేరాలను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆధునిక టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాలని ముఖ్యమంత్రి N Chandrababu Naidu ఆదేశించారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్టులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త విధానాలు, బెస్ట్ ప్రాక్టీసెస్‌ను అమలు చేయాలని సూచించారు.
బుధవారం రాత్రి DGP స్థాయి నుంచి Station House Officers వరకు పోలీసు అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని మరింత పెంచాలని చెప్పారు. దేశవ్యాప్తంగా మంచి పేరున్న పోలీస్ ఫోర్స్‌గా ఆంధ్రప్రదేశ్ పోలీసులను తీర్చిదిద్దాలని సూచించారు.
మారుతున్న నేరాలకు అనుగుణంగా పోలీసింగ్
“Policing must become more effective as crimes change rapidly. Technology, knowledge and best practices should be used to meet new emerging challenges effectively and maintain law and order,” అని Naidu అన్నారు.
గత రెండేళ్లలో cognisable crimes 14 శాతం తగ్గాయని సీఎం చెప్పారు. అయితే digital crimes, digital arrests పోలీసులకు కొత్త సవాళ్లుగా మారుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ‘Invisible Police, Visible Policing’ వ్యూహాన్ని అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు.
మహిళలపై నేరాల్లో జీరో టాలరెన్స్
మహిళలపై జరిగే నేరాల విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. నేరస్థులపై ఎలాంటి జాలి చూపొద్దని అధికారులకు ఆదేశించారు.
ప్రైవేట్ కెమెరాలను కూడా కలుపుకుని 14,770 CCTV కెమెరాలను నెట్‌వర్క్‌లోకి తీసుకొచ్చినట్లు సీఎం తెలిపారు.
డ్రగ్స్, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి
“Drugs Vaddhu Bro” ప్రచారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు రోడ్ సైనేజ్, ఇంజినీరింగ్ వ్యవస్థ, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ఆడిట్లు నిర్వహించాలని ఆదేశించారు.
రాజకీయ నేరాలు, సోషల్ మీడియాపై చర్యలు
రాజకీయ నేరాలు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, వ్యక్తిగత దూషణలపై లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సంఘ వ్యతిరేక శక్తుల్లో పోలీసులంటే భయం కలిగేలా చర్యలు ఉండాలని చెప్పారు.
మానసిక ఆరోగ్యం, ప్రవర్తనా సమస్యలతో సంబంధం ఉన్న నేరాలపై సమాజంలో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు సూచించారు.
ప్రతి నెల పోలీస్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్
ప్రతి నెల Police Performance Report విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇందులో పోలీస్ శాఖలో అమలు చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్, విజయవంతమైన చర్యలను చేర్చాలని సూచించారు.



