2026 డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల
Telangana : తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా 2026 డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్‌ను తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ విడుదల చేసింది.
ఈ జాబితాను Election Commission of India (ECI) అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
ముందుగా Part Number, Part Serial Number ఎలా తెలుసుకోవాలి?
వివరాలు ఉంటే డ్రాఫ్ట్ రోల్లో మీ పేరు, ఇతర వివరాలను సులభంగా చెక్ చేసుకోవచ్చు.
Part Number, Part Serial Number తెలుసుకోవడం ఎలా?
ముందుగా ECI అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. స్క్రీన్ కుడివైపు కనిపించే ‘Search Your Name in E-roll’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో ECI డొమైన్లోని మరో వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతారు.
అక్కడ ఓటర్ కార్డుపై ఉన్న EPIC Numberను నమోదు చేసి రాష్ట్రంగా Telanganaను ఎంచుకోవాలి. అదే పేజీలో ‘Search by Details’, ‘Search by Mobile Number’ ఆప్షన్లతో కూడా ఓటర్ వివరాలను వెతకవచ్చు.
క్యాప్చా నమోదు చేసి సెర్చ్ చేస్తే కింద ఫలితాలు కనిపిస్తాయి. ఇందులో EPIC Number, Name, Age, Relative Name, State, District, Assembly Constituency, Part Number, Polling Station, Part Serial Number వంటి వివరాలు ఉంటాయి.
SIR-2026 డ్రాఫ్ట్ రోల్లో పేరు ఎలా చెక్ చేయాలి?
ముందుగా ECI వెబ్సైట్లోకి వెళ్లి **‘SIR-2026 Download Electoral Roll’**పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ECI డొమైన్లోని మరో పేజీకి వెళ్తారు.
అక్కడ ఈ వివరాలను ఎంచుకోవాలి:
- State: Telangana
- Year of Revision: 2026
- Roll Type: SIR Draft Roll-2026
- District: మీ జిల్లా
- Assembly Constituency: మీ నియోజకవర్గం
- Language: Telugu/English
వివరాలు ఎంచుకున్న తర్వాత కింద Part Numbers, Part Names కనిపిస్తాయి. మీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన Part Numberను గుర్తించాలి.
ఉదాహరణకు మీ Part Number 231 అయితే, సెర్చ్ బాక్స్‌లో 231ను నమోదు చేయాలి. ఆ నంబర్‌కు సంబంధించిన ప్రాంతం డౌన్లోడ్ కోసం కనిపిస్తుంది.
ఎడమవైపు కనిపించే సంబంధిత రిజల్ట్‌ను ఎంచుకుని క్యాప్చా నమోదు చేయాలి. ఆ తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
PDFలో మీ వివరాలు ఎలా వెతకాలి?
డౌన్లోడ్ చేసిన PDFను ఓపెన్ చేసి Part Serial Number ఆధారంగా మీ వివరాలను వెతకాలి. ఈ వివరాలు సీరియల్ క్రమంలో ఉంటాయి.
ఉదాహరణకు మీ Part Serial Number 123 అయితే, PDFలో 123వ సీరియల్ నంబర్ వద్ద మీ వివరాలు కనిపిస్తాయి.
అయితే ఎన్యూమరేషన్ ఫారం సమర్పించినవారి వివరాలు మాత్రమే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో కనిపిస్తాయి.



